మట్టి ప్రతిమలు చేయండిమళ్లీ వస్తా..!

- సాగర తీరం.. భక్త జన సందోహం
- అంగరంగ వైభవంగా నిమజ్జన వేడుకలు
- అనుకున్న సమయానికే గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ వినాయకుడు
- బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ దాకా.. శోభాయాత్ర
- తీరొక్క గణపతులు… హోరెత్తిన భక్తి నినాదాలు
- వర్షంలోనూ తీన్మార్ స్టెప్పులు..కేరింతలు
- మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ ప్రత్యేక సేవలు
- వినాయకులతో భక్తుల సెల్ఫీ జోష్
వీధులు జనసంద్రమయ్యాయి. జనం సాగర బాట పట్టారు. ఇసుక వేసినా రాలనంతగా ట్యాంక్ బండ్ దారులు కిక్కిరిశాయి. కాషాయ ధ్వజాలు సగౌరవంగా రెపరెపలాడగా.. నవరాత్రులు మహా వైభవంగా పూజలందుకున్న తీరొక్క రూపాల గణనాథులు సంతృప్తిగా కదలి శోభాయాత్రకు తరలివచ్చాయి. జై బోలో గణేశ్ మహారాజ్‌కి జై.. గణపతి బొప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలు మిన్నంటాయి. బూరల శబ్ధాలు, డప్పు దరువులు, తీన్మార్ నృత్యాలతో యువత కోలాహలం విశేషంగా ఆకట్టుకుంది.
అనుకున్నట్టుగానే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మధ్యాహ్నం 3:23 గంటలకు పూర్తయింది. మహాగణపతి నిమజ్జనం సాగర్‌లో ఇదే చివరి సారి కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. బాలాపూర్ గణపతి శోభాయాత్ర పాతనగరం మీదుగా సాగర్‌కు శోభాయమానంగా సాగింది. దారి పొడవునా అశేష భక్తజనం నీరాజనం పలికారు. నిమజ్జనానికి తరలివచ్చిన విశేష ఆకృతుల్లో ఉన్న గణనాథులు భక్తులను ఆకట్టుకున్నాయి. బైబై గణేశా.. అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. మళ్లీ రావయ్య గణనాథ అంటూ వేడుకున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ ప్రత్యేక సేవలందించాయి.
గంగమ్మ ఒడికి మహా గణపతి..!
ఖైరతాబాద్ మహా గణేశుడి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, నిర్వాహకులు పటిష్టమైన ఏర్పాట్లు చేసి శోభాయాత్రను నిర్వహించారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 4వ నంబర్ క్రేన్ వద్ద ఖైరతాబాద్ మహా గణేశుడి విగ్రహాన్ని మధ్యాహ్నం 3:23 గంటలకు నిమజ్జనం చేశారు.
విభిన్న రూపాల్లో..!!
- ఏనుగు ప్రతిమలో భారీ రథాన్ని ఏర్పాటు చేసి అందులో చిట్టి గణపయ్యను ఊరేగింపుగా తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది.
- పంచ ధరించి కండువా కప్పుకున్న మరో గణపతి విగ్రహం ప్రత్యేకంగా కనిపించింది.
- కరోనా వైరస్‌ను తుద ముట్టించి కాలుతో తొక్కుతున్నట్టు రూపొందించిన గణపతి విగ్రహం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నట్టుగా ఉంది.
- మరికొన్ని గణపతులు మాస్కులు ధరించి దర్శనమిచ్చాయి.
- జోరు వానలోనూ.. తగ్గని జోష్
- జోరు వానలో కూడా వినాయక నిమజ్జనం జోష్ ఏమాత్రం తగ్గలేదు. మధ్యాహ్నం 2.30గంటల నుంచి గ్రేటర్‌లోని పలు చోట్ల కురిసిన వర్షంలో లంబోదరుడి ఊరేగింపు వేడుకగా ముందుకు సాగింది. కొంత మంది భక్తులు గణపతి తడవకుండా ఉండేందుకు గొడుగులు, ప్లాస్టిక్ కవర్లతో రక్షణ కల్పించడం కనిపించింది.
బాలాపూర్‌లో మొదలైన శోభాయాత్ర..
- బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు ఉదయం 6.15 గంటలకు ప్రారంభమై, సుమారు మూడున్నర గంటల పాటు బాలాపూర్ పురవీధుల్లోనే తిరిగి 10.00 గంటలకు బాలాపూర్ బొడ్రాయి వద్దకు చేరుకుంది.
- 10.05 గంటలకు లడ్డూ వేలం నిర్వహించారు.
- అనంతరం ప్రారంభమైన శోభాయాత్ర బాలాపూర్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, నల్లవాగు, కందికల్‌గేట్ ఫ్లైఓవర్, చత్రినాక, లాల్‌దర్వాజ ఆలయం, నాగుల్చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, మోజంజాహీ మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నది.
- రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీపీ సన్ ప్రీత్‌సింగ్, ఏసీపీ పురుశోత్తం రెడ్డి, అడిషనల్ డీసీపీలు, అడిషనల్ ఏసీపీలు, సీఐ భాస్కర్, మహేందర్‌రెడ్డి పర్యవేక్షించారు.
రవాణా సాఫీగా..
- మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులు ట్రిప్పులను పెంచాయి.
- మెట్రో సర్వీస్‌లను అర్ధరాత్రి 1 వరకు నడుపగా.. ఆదివారం ఒక్కరోజే సుమారు 3 లక్షల మంది మెట్రో ప్రయాణం చేశారు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒక మెట్రో రైలు అందుబాటులో ఉంచారు.
- ప్రత్యేకంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను నడిపారు.
- గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 565 ప్రత్యేక బస్సులను నడిపారు.
కొవిడ్ జాగ్రత్తలు పాటించలే..!
గడిచిన ఏడాది కరోనా మహమ్మారి విజృంభించడంతో గణేశ్ ఉత్సవాలకు విరామం ప్రకటించారు. ఈ ఏడాది కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం జరిగిన నిమజ్జనంలో లక్షలాది మంది భక్తుల్లో మంచి జోష్ కనిపించింది. కాకపోతే అందరినీ కలిచివేసిన విషయం.. అత్యధిక మంది కొవిడ్ నిబంధనలకు తిలోదకాలివ్వడం. సాధారణంగా ఇలాంటి ఉత్సవాల్లో భౌతిక దూరం పాటించడమనేది కష్ట సాధ్యమే.
మాస్కు ధరించడం వల్ల మహమ్మారి ప్రభావం వ్యాపించకుండా అడ్డుకట్ట వేయడం సులువు. ఆదివారం జరిగిన వినాయక శోభాయాత్రలో అత్యధిక మంది మాస్కు లేకుండానే కనిపించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా శోభాయాత్రలో మాత్రం కొవిడ్ నిబంధనలను అత్యధిక మంది పాటించకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగర్‌కు వేలాది విగ్రహాలు
నగరంలో ప్రతిష్టించిన గణనాథులను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. లాల్‌దర్వాజ, అఫ్జల్‌గంజ్, బేగంబజార్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, చాదర్‌ఘాట్, కాచిగూడ, మలక్‌పేట, దిల్సుఖ్నగర్, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, మల్లేపల్లి, మాసబ్‌ట్యాంక్, విజయనగర్ కాలనీ, కార్వాన్, మంగళ్‌హట్, సికింద్రాబాద్, కూకట్పల్లి, అంబర్‌పేట, రామంతాపూర్, విద్యానగర్, నల్లకుంట తదితర ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు ఊరేగింపుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నాయి.
మట్టి గణపతికే జై..!!
- ఎప్పటిలాగే ఈసారి కూడా మట్టి గణపతులకే నగరవాసులు జై కొట్టారు.
- అపార్టుమెంట్లలో ఏర్పాటు చేసుకున్న మట్టి వినాయకులను అక్కడే కొలను ఏర్పాటు చేసుకుని నిమజ్జనం చేశారు.
- కొందరు విత్తన గణేశులను తొట్టిలో వేసి మొక్కలుగా పెంచడానికి నిమజ్జనం చేశారు.
- గ్రేటర్ వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

