నేడు వినాయకుడి మహా నిమజ్జనం

- బాలాపూర్ గణనాథుడితో శోభాయాత్ర ప్రారంభం
- ఒక్క సాగర్‌లోనే 45 వేల విగ్రహాల నిమజ్జనం
- గ్రేటర్ వ్యాప్తంగా నిమజ్జన కేంద్రాలు 33
- మూడు కమిషనరేట్లలో 39 వేల మందితో బందోబస్తు
- నిఘా నీడన నగరం.. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చెరువుల వద్ద ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు
- శిబిరాల్లో కరోనా పరీక్షలు, టీకాలు
- సాగర్ పరిసరాల్లో 10 చోట్ల పార్కింగ్ స్థలాలు
మా బొజ్జ గణపయ్యా.. పూజలందుకోవయ్యా… మా చిట్టి గణపయ్యా.. విఘ్నాలు తొలగించయ్యా.. అంటూ నవరాత్రులు అఖండ పూజలందుకొని నిమజ్జనానికి పయనమయ్యాడు. కరోనా నుంచి భక్తజనులకు ఊరటనిస్తూ తల్లిఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. నిమజ్జనం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమై 17 కిలోమీటర్లు సాగి హుస్సేన్‌సాగర్‌కు చేరుకోనుంది. ఈ ఒక్క మార్గంలోనే 27 వేలమందితో భారీ భద్రతను సమకూర్చుతున్నారు.
గ్రేటర్‌వ్యాప్తంగా 60 వేల విగ్రహాలు ఉండగా, హుస్సేన్‌సాగర్‌లో 45 వేల ప్రతిమలు నిమజ్జనం కానున్నాయి. మహా వేడుక నేపథ్యంలో బల్దియా, జలమండలి, పోలీసు, వైద్యారోగ్యశాఖ, రవాణా, ఆర్టీసీ, తదితర విభాగాలు అన్ని వసతులు కల్పించడంలో నిమగ్నమయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 320 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కంట్రోల్ రూంలతోపాటు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో కరోనా పరీక్షలతోపాటు టీకాలు కూడా వేయనున్నారు.
రేపటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు
నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు నగరవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఇతర జిల్లాల నుంచి బస్సులు, లారీలు, ఇతర వాహనాలను నగరంలోకి అనుమతించరు. జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల్ని శివార్లకే పరిమితం చేయనున్నారు.
మద్యం అమ్మకాలు బంద్
గణేశ్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధుల్లో మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నారు.
రాత్రి ఒంటి గంట వరకు మెట్రో
సాధారణంగా ఆఖరి మెట్రో రైలు రాత్రి 10.15 గంటలకు బయల్దేరుతుంది. నేడు నిమజ్జనం నేపథ్యంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయి. గమ్యస్థానాలకు 2 వరకు చేరుకుంటాయి. అలాగే 565 ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. అదనంగా 8 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు.
15 వైద్య శిబిరాలు… 18 అంబులెన్సులు…
వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా శోభాయాత్ర జరిగే ప్రాంతాలతో పాటు విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాలలో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు కొవిడ్ టీకా కూడా వేయనున్నారు. నగర వ్యాప్తంగా మొత్తం 15వైద్య శిబిరాలను ఏర్పాటు చేయగా అందులో 7 ప్రధాన వైద్య శిబిరాలు ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి వివరించారు. ట్యాంక్‌బండ్, మెహిదీపట్నం, మోజంజాహి మార్కెట్, ఎన్టీఆర్ మార్గ్, అంబర్పేట్, చార్మినార్, నాంపల్లి, అబిడ్స్, అంబర్పేట్, నల్గొండ ఎక్స్‌రోడ్ తదితర ప్రాంతాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
ప్రతి శిబిరం వద్ద ఒక అంబులెన్స్ చొప్పున 15అంబులెన్స్‌లను, మరో మూడు అంబులెన్స్‌లను అదనంగా అందుబాటులో ఉంచినట్లు డా.వెంకటి తెలిపారు. అంతే కాకుండా సమాచారం, సిబ్బంది సమన్వయం కోసం మొత్తం 10 చోట్ల కమాండ్ కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని, అందులో ఒకటి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటుందన్నారు.
హుస్సేన్‌సాగర్‌లో మొత్తం 45 వేల విగ్రహాల నిమజ్జనం
- సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ
- బాంబ్ స్కాడ్, స్నిఫర్ డాగ్ స్కాడ్, క్విక్ రెస్పాన్స్ బృందాలతో తనిఖీలు
- వాచ్టవర్లు ఏర్పాటు.. 3000 వేల వాకీ టాకీలతో నిరంతర సమాచార సేకరణ
- శోభాయాత్ర పర్యవేక్షణకు 276 సీసీ కెమెరాలు. సాగర్ చుట్టూ 100 సీసీ కెమెరాలు.
- 10 ఫీట్లు, ఆపై ఎత్తైన విగ్రహాల వాహనాలకు ఎరుపు రంగు స్టిక్కర్లు..10 ఫీట్ల లోపు ఉన్న విగ్రహాల వాహనాలకు నీలి రంగు స్టిక్కర్లు..స్టిక్కర్లపై రూటు వివరణ.
- 10 షీ టీమ్స్ ప్రత్యేక బృందాలు, 7 మెడికల్ బృందాలు
- ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం. 4 వద్ద ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం
- ఫలక్‌నుమా బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో శనివారం రాత్రి మరోసారి ట్రయల్ రన్.. ఇబ్బందులు లేకపోతే బాలాపూర్‌తో పాటు 15 అడుగులు ఎత్తు ఉన్న విగ్రహాలకు ఫలుక్‌నుమా బ్రిడ్జిపై అనుమతి… లేదంటే మార్గం మళ్లింపు.
- హుస్సేన్‌సాగర్ వద్ద ఐదు తాత్కాలిక నిమజ్జన సరస్సులు. పీవీ మార్గ్ వద్ద కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు.
- డీజేలకు అనుమతి లేదు.
- భక్తులు, సాధారణ ప్రజలకు ప్రత్యేక పార్కింగ్‌ల ఏర్పాటు
- సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో…
- మొత్తం గణేశ్ విగ్రహాలు 8434
- అత్యధికంగా ఐడీఎల్ ట్యాంక్‌లో నిమజ్జనం
- మొత్తం 35 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు
- జీహెచ్ఎంసీలో 23 చెరువులు, మేడ్చల్ జిల్లా పరిధిలో 3, రంగారెడ్డి జిల్లాలో 9 చెరువులు
- హూస్సేన్సాగర్లో నిమజ్జనానికి 620 విగ్రహాలు..
- 6500 పోలీసు సిబ్బందితో బందోబస్తు
- 36 స్టాటిక్, 54 మొబైల్ క్రేన్ల ఏర్పాటు.
- డ్రోన్ కెమెరాలకు అనుమతి లేదు.
- పోలీసు సహాయానికి 9490617444కు వాట్సాప్ సమాచారం అందించాలి.
- ఈవ్‌టీజర్లు, పోకిరీల సమాచారాన్ని 9493622395కు ఇవ్వాలి.
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో..
- మొత్తం విగ్రహాలు 6500
- 5000 మందితో పోలీసు బందోబస్తు
- సోషల్ మీడియా పోస్టింగ్‌లపై 24/7 నిఘా
- మొత్తం 24 చెరువుల వద్ద నిమజ్జనం.
- అధికంగా సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా చెరువులో నిమజ్జనం.
- పోలీసుల సహాయానికి 9490617111కు వాట్సాప్ సమాచారం ఇవ్వండి
- సరూర్‌నగర్ చెరువు వద్ద గజ ఈతగాళ్ల ఏర్పాటు.
- సరూర్‌నగర్ చెరువుకు వచ్చే విగ్రహాలకు రూట్ మ్యాప్…
- హయత్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, సరూర్‌నగర్, నాగార్జునసాగర్ రోడ్డు, కర్మన్‌ఘాట్(శ్రీనివాస కాలనీ, మధురానగర్, బైరామల్‌గూడ, దుర్గానగర్) నిర్వాహకులు సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ జంక్షన్, కొత్తపేట్, దిల్సుఖ్నగర్, వెంకటాద్రి థియేటర్ ఎడమ వైపు నుంచి శివగంగ థియేటర్, శంకేశ్వర్‌బజార్ జంక్షన్ సరూర్‌నగర్ ట్యాంక్ వద్దకు చేరుకోవాలి.
- చాదర్‌ఘాట్, మలక్‌పేట్,ముసారాంబాగ్, అంబర్పేట్ నుంచి వచ్చే విగ్రహాలు మూసరాంబాగ్ ఎక్స్ రోడ్డు, కోణార్క్ డయాగ్నస్టిక్స్ వద్ద యూటర్న్ శివగంగ థియేటర్, శంకేశ్వర్బజరా జంక్షన్ సరూర్‌నగర్ చెరువుకు చేరుకోవాలి.
- సైదాబాద్, సంతోష్‌నగర్, ఐఎస్ సదన్ నుంచి వచ్చే విగ్రహాలు సింగరేణి కాలనీ, శంకేశ్వర్‌బజార్, సరూర్‌నగర్ ట్యాంక్‌కు చేరుకోవాలి.
- నిమజ్జనం తర్వాత ఖాళీ వాహనాలు సరూర్‌నగర్ పోస్టాఫీసు వైపు లేదా కర్మాన్‌ఘాట్ రోడ్డు వైపు వెళ్లాలి.
నిమజ్జనంలో… జర భద్రం
- భక్తులు ఈ జాగ్రత్తలు పాటించండి
- నగరంలో ఆదివారం జరిగే గణేశ్ నిమజ్జన సంబురానికి వెళ్లే భక్తులు, ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు.
- కొవిడ్ నిబంధనలు పాటించాలి.
- మీ వస్తువులు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి.
- సాగర్‌తో పాటు నిమజ్జనం జరిగే ప్రతి చెరువు సీసీ నిఘాలో ఉంటుంది.
- పుకార్లను నమ్మకండి. గందరగోళం సృష్టించే మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయొద్దు.
- వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలి.
- పిల్లల జేబులో ఫోన్ నెంబర్, ఇంటి చిరునామా, కుటుంబ సభ్యుల పేర్లు రాసి ఉంచండి.
- పోలీసు ఎమర్జెన్సీ నెంబర్లను ఫోన్లో ఫీడ్ చేసి పెట్టుకోండి.
- షీ టీమ్స్ గస్తీలో ఉంటాయి. వేధింపులు ఉంటే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయండి.
- అనుమానాస్పద వస్తువులు, మనుషులు కనపడితే డయల్ 100కు ఫిర్యాదు చేయండి.
నిమజ్జనం తర్వాత ఖాళీ వాహనాలు వెళ్లే మార్గం
- నెక్లెస్ రోడ్డు – ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ – పీవీ విగ్రహం – కేసీపీ మార్గం మీదుగా వెళ్లాలి ట్యాంక్‌బండ్‌పైన నిమజ్జనం చేసిన తర్వాత చిల్డ్రన్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ లేదా ఇందిరాపార్క్, అశోక్‌నగర్, విద్యానగర్ వైపు వెళ్లాలి.
- బైబిల్ హౌజ్ రైలు ఓవర్ బ్రిడ్జి వైపు వాహనాలకు అనుమతి లేదు.
- నగరంలో తిరిగే ఆర్టీసీ బస్సులకు ఇతర మార్గాల్లో ప్రయాణించేలా ఏర్పాట్లు
- ఆదివారం ఉ.10 నుంచి సోమవారం ఉ. 10 గంటల వరకు నగరంలోకి
- ప్రైవేటు బస్సులకు అనుమతి లేదు.
- ఇతర జిల్లాల నుంచి నగరానికి వచ్చే ఆర్టీసీ బస్సులు ఎమ్జీబీఎస్ డిపోకు చేరుకునేందుకు ప్రత్యేక రూట్ మ్యాప్.
- విమానాశ్రయానికి వెళ్లే వారు ఊరేగింపు మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలి.
- ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులపై సమాచారం కావాలంటే ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్లు 040-27852482, 9490598985, 9010203626లలో సంప్రదించవచ్చు.
మీ వాహనాల పార్కింగ్ ఇక్కడే..
- గణేశ్ మహా ఊరేగింపు సందర్భంగా హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చే వీక్షకుల కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
- పార్కింగ్ స్థలాల వివరాలు :
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ – ఖైరతాబాద్ జంక్షన్
- ఎమ్ఎమ్టీఎస్ స్టేషన్ – ఖైరతాబాద్
- ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయం వరకు.
- బుద్ధభవనం వెనకాల
- గోసేవా సదన్
- కట్ట మైసమ్మ దేవాలయం
- నిజాం కాలేజీ
- లోయర్ ట్యాంక్ బండ్
- ఎన్టీఆర్ స్టేడియం
- పబ్లిక్ గార్డెన్
మద్యం అమ్మకాలు బంద్
గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలపై పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్రలు రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. ఆదివారం ఉ. 6 గంటల నుంచి సోమవారం సా. 6 గంటల వరకు మద్యం, కల్లు అమ్మకాలు జరుపొద్దని, వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్లు హెచ్చరించారు.
1200 వాహనాలు సిద్ధం
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 ( నమస్తే తెలంగాణ ) : నిమజ్జన విధుల్లో భాగంగా రవాణాశాఖ అధికారులు గణనాథుల తరలింపునకు 1200 వాహనాలను మండపాల నిర్వాహకులకు సమకూర్చారు. అందులో భాగంగా అన్నీ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సంబంధిత ఆర్టీవోల సమక్షంలో వాహనాలను అప్పగించారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగనాయక్ ఆర్టీఏ పరిధిలో ఉన్న నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జన ఉత్సవంలో 100 మంది హోంగార్డ్స్, 10 మంది ఆర్టీవోలు, ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు విధుల్లో ఉంటారని తెలిపారు. గణనాథుల ఆకారం ఆధారంగా లారీలు, ట్రక్కులు, ట్రాలీలు, ట్రాక్టర్లు ఇలా అన్ని రకాల వాహనాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాల అవసరం ఏర్పడినా కూడా వాహనాలను సమకూర్చుతామని జేటీసీ తెలిపారు.
అర్ధరాత్రి తర్వాతా ఆర్టీసీ సేవలు
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 19న అర్ధరాత్రి తర్వాత కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 565 ప్రత్యేక బస్సులపై ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ పేరుతో బోర్డు పెట్టనున్నారు. ఆర్టీసీలో ప్రయాణించే భక్తులకు సమస్యలు ఉంటే రేతిఫైల్ బస్‌స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌స్టేషన్‌లో 9959226160 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ట్రాఫిక్ క్లియరెన్స్‌కు బండ్లగూడ డిపో మేనేజర్ వి. మల్లయ్య (9959226087), మిధాని డిపో మేనేజర్ టీ. కిషన్‌రావు (9959226139) అందుబాటులో ఉండనున్నారు. ఈ ఇద్దరు అధికారులు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు విధుల్లో ఉంటారని జోన్ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

