ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్

హైదరాబాద్ : నాన్ కొవిడ్ ఎమర్జెన్సీ సేవల నిమిత్తం ఉచిత అంబులెన్స్ సర్వీసులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం ప్రారంభించారు. టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్ స్మార్ట్ఐఎంఎస్ ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మెడికల్ చెకప్‌కు వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు రోజులో ఎప్పుడైనా ఈ సేవలను ఉచితంగా పొందవచ్చన్నారు.
ఆక్సిజన్, వెంటిలేషన్, ఇతర అత్యవసర సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌లను అందిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు, గర్భిణీలు, వికలాంగులు ఈ సేవలను ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు, బ్లడ్ బ్యాంకులను సందర్శించేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో వచ్చే రెండు నెలలు ఈ అంబులెన్సులు క్రీయాశీలకంగా అందుబాటులో ఉండనున్నట్లు చెప్పారు. కొవిడ్ -19 నుండి ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి మాస్కు ధరించడం, శానిటైజర్‌ను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
నాన్ కొవిడ్ -19 వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు రాచకొండ కొవిడ్ కంట్రోల్ హెల్ప్‌లైన్ నంబర్ 9490617234 ను సంప్రదించవచ్చు అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను పొందటానికి స్టాన్‌ప్లస్ హాట్‌లైన్ నంబర్ 1800 – 121911911 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

