లోన్ యాప్ పేరిట మోసం
లోన్ యాప్ పేరిట మోసం చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బుకు ఆరు రెట్లు అధికంగా వసూలు చేశారు. ఇంకా డబ్బు కట్టాల్సిందే.. లేకుంటే మార్ఫింగ్ న్యూడ్ వీడియోలను ఫోన్ కాంటాక్ట్స్ నంబర్లకు పంపిస్తామని బెదిరింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- మార్ఫింగ్ న్యూడ్ ఫొటోలను ఫోన్ కాంటాక్ట్స్‌కు పంపిస్తామని బెదిరింపులు
- పోలీసులకు బాధితుడు ఫిర్యాదు.. కేసు నమోదు
వెంగళరావునగర్, జూన్ 25: లోన్ యాప్ పేరిట మోసం చేశారు. అప్పుగా తీసుకున్న డబ్బుకు ఆరు రెట్లు అధికంగా వసూలు చేశారు. ఇంకా డబ్బు కట్టాల్సిందే.. లేకుంటే మార్ఫింగ్ న్యూడ్ వీడియోలను ఫోన్ కాంటాక్ట్స్ నంబర్లకు పంపిస్తామని బెదిరింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడకు చెందిన ఎస్.గుర్మిత్‌సింగ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. రుణం కోసం ప్లే స్టోర్ నుంచి స్కోర్ అనలైజర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. లోన్ కోసం తన పాన్‌కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ వివరాలను ఇచ్చాడు. ఈ నెల 17న రెండు విడతలుగా రూ.3,600 లను బదిలీ చేశారు. ఇలా తీసుకున్న రుణానికి గానూ ఇప్పటి వరకు కేవలం వారం రోజుల్లోనే రూ. 22,800 తిరిగి చెల్లించాడు. ఇంకా డబ్బు ఇవ్వాలని.. లేకుంటే మార్ఫింగ్ న్యూడ్ ఫొటోలను వైరల్ చేస్తామని బెదిరింపులకు గురిచేశారు. వేధింపులు ఆగకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధురానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

