సిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీతో(CCMB) ఫ్రాన్స్‌కు(France) చెందిన మెడికల్ రీసెర్చ్ సంస్థ పాస్చర్(,Pasteur) ఒప్పందం కుదుర్చుకున్నది. వైద్యా, ఆరోగ్య రంగంలో పరిశోధనల్లో సీసీఎంబీ సాయం అందించనుంది. గురువారం సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరితో ఫ్రాన్స్ ఎంబసీ దౌత్యవేత్త థిరీ మాథౌ ప్రత్యేకంగా భేటీయ్యారు. ఈ మేరకు పాస్చర్ ఒప్పందంపై ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలిపారు. కాగా ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం వైద్య, ఆరోగ్య రంగంలో జరిగే పరిశోధనల్లో కీలక పాత్రను పోషిస్తుందన్నారు.