గంటలోనే ఆచూకీ కనుగొన్నారు
ఇంటి నుంచి తప్పిపోయిన ఓ చిన్నారిని గంటలోనే పోలీసులు గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి కథనం ప్రకారం..
చార్మినార్, జూలై 12 : ఇంటి నుంచి తప్పిపోయిన ఓ చిన్నారిని గంటలోనే పోలీసులు గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటన భవానీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి కథనం ప్రకారం.. భవానీనగర్ పరిధిలోని డాజిలింగ్ పాఠశాల సమీపంలో నివసించే ఫౌజియా ఫాతిమా కుమార్తె ఎనిమిదేండ్ల ఇమాన్ ఫాతిమా గతకొంత కాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నది. శుక్రవారం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉండగా.. ఇమాన్ ఫాతిమాను పాఠశాలకు పంపలేదు. ఉదయం 9 గంటల సమయంలో ఫౌజియా ఫాతిమా ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఇమాన్ ఫాతిమా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తల్లి ఇంట్లో పనులు ముగించుకొని చూడగా కూతురు కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. ఆందోళన చెందిన ఫాతిమా భవానీనగర్ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తులో భాగంగా ఇన్స్పెక్టర్ బాలస్వామి మూడు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసు బృందాలు ఇమాన్ ఫాతిమా మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని హరిబౌలి ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇమాన్ ఫాతిమా ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షేమంగా ఆమెను స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఫౌజియా ఫాతిమాకు చిన్నారిని అప్పగించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ బాలస్వామి, పోలీసు అధికారులు, సిబ్బందికి బాలిక కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

