స్టార్టప్‌ల సమగ్రాభివృద్ధే లక్ష్యం
స్టార్టప్‌ల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన జీ20 స్టార్టప్ సన్నాహక సమావేశాలు ఆదివారం ముగిశాయి.
- ముగిసిన జీ20 సన్నాహక సమావేశాలు
సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌ల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ వేదికగా జరిగిన జీ20 స్టార్టప్ సన్నాహక సమావేశాలు ఆదివారం ముగిశాయి. రెండు రోజుల పాటు నగరంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరై స్టార్టప్ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌ల మార్కెట్ వంటి అంశాలపై చర్చించారు. స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్‌లతో కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు కలిసి పనిచేసే వాతావరణాన్ని సృష్టించడం చేయనున్నారు. ఎంగేజ్మెంట్ గ్రూప్‌లో భాగంగా ఫౌండేషన్, అలయన్స్, ఫైనాన్స్, ఇన్‌క్లూజన్, సైస్టెనబిలిటీ అనే అంశాలపై ప్రత్యేకంగా మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరుగా చర్చలు జరిపారు.
స్టార్టప్ 20ఎక్స్‌ను ప్రారంభించిన సునీల్ శెట్టి..
హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న జీ20 స్టార్టప్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు స్టార్టప్ 20ఎక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టార్టప్20 చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, బాలీవుడ్ హీరో, స్టార్టప్స్ ఇన్వెస్టర్ సునీల్ శెట్టిలు స్టార్టప్ 20ఎక్స్‌ను ప్రారంభించారు. హోటల్ తాజ్ కృష్ణాలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్టార్టప్‌ల పురోగతిపై ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్టార్టప్ 20 ఎక్స్ కార్యక్రమం ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని స్టార్టప్ ఇన్వెస్టర్ల ద్వారా పొందేలా దీన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.
పర్యాటక ప్రదేశాలు సందర్శించిన ప్రతినిధులు..
నెట్ వరింగ్ లంచ్ తర్వాత, దేశ ప్రతినిధులు తాజ్ కృష్ణలోని గార్డెన్ రూమ్‌లో స్టార్టప్ 20లో క్లోజ్డ్ డోర్ సెషన్ కు వెళ్లారు. అనంతరం ఇన్ క్రెడిబుల్ ఇండియా లైట్ అండ్ సౌండ్ షో కోసం హుస్సేన్ సాగర్ లేక్‌కు వెళ్లారు. చారిత్రాత్మక కట్టడమైన గోలొండ కోటకు సాంసృతిక విహారయాత్ర సాగింది.
టీ వర్క్స్‌ను సందర్శించిన జీ20 ప్రతినిధులు
దేశంలోనే అతి పెద్ద వస్తువుల నమూనా తయారీ కేంద్రంగా టీవర్క్స్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న జీ20 స్టార్టప్ ప్రతినిధుల బృందం ఐటీ కారిడార్‌లోని టీ వర్క్స్ కేంద్రాన్ని ఆదివారం సందర్శించింది. ఇందులో రకరకాల ఉత్పత్తుల తయారీకి సంబంధించిన యంత్రాలు, వాటితో తయారు చేసే పనిముట్లను పరిశీలించారు. టీ వర్క్స్ ప్రత్యేకతలను ప్రతినిధుల బృందానికి నిర్వాహకులు వివరించారు. టీ హబ్ పక్కనే ఉన్న విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన టీ వర్క్స్ నిర్మాణం అద్భుతంగా ఉన్నదని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఔత్సాహికుల ఆలోచనలకు అనుగుణంగా టీ వర్క్స్‌లో తమ ఉత్పత్తుల నమూనాలు, ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ఉపయోగపడేలా ఉంటుందని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

