మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం
సుభాష్‌నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.
కుత్బుల్లాపూర్, మే 29: సుభాష్‌నగర్ డివిజన్ పైపులైన్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ మెకానిక్ కారు షెడ్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. తిరుమల వైన్స్ ఎదురుగా ఉన్న ఓ కారు మెకానిక్ షెడ్డులో కరెంటు షార్ట్‌సర్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
అప్పటికే మెకానిక్ షెడ్డులోని కొన్ని కార్లు స్వల్పంగా కాలిపోవడంతోపాటు ఆ ప్రాంతమంతా పొగ కమ్మేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాగా ప్రమాదం జరిగిన మెకానిక్ షెడ్డుకు ఆనుకొని ఒక ఐదంతస్తుల భవనంతోపాటు ఫర్నిచర్ దుకాణం, ఇతర షాపులు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరి మంటలు ఆర్పేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

