హైదరాబాద్: హైదరాబాద్‌లోని చందానగర్ (Chandanagar) జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో చందానగర్‌లోని తపాడియా షాపింగ్ మాల్ ఐదో అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్‌లో (JP Cinemas) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదు స్క్రీన్లు, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కై లిఫ్టర్, నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, అగ్నిప్రమాదంతో ఇప్పటికే భారీగా ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు వెల్లడించారు.