ఫిల్మ్‌నగర్ ఎస్ఐపై బదిలీ వేటు!
నగరంలో దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరు పోలీసులకు వత్తాసు పలికి తాను ఆ సమయంలో డ్యూటీలో లేనట్లుగా చూపించుకునే ప్రయత్నం చేసిన ఫిల్మ్‌నగర్ ఎస్ఐ సలీంపై వేటు పడింది. ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అతనిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ..ఉత్తర్వులు జారీ చేశారు
-
స్థానిక పోలీసులను పెద్దసారు పేరు చెప్పి బెదిరించేవాడంటూ గుసగుసలు
-
వీఆర్‌కు అటాచ్ చేస్తూ..ఉత్తర్వులు జారీ
-
దారిదోపిడీ కేసులో సలీం పాత్రపై విచారణ
-
‘నమస్తే’ కథనాలతో కదిలిన ఉన్నతాధికారులు
-
సదరు ఎస్ఐ సలీంపై అనేక ఫిర్యాదులున్నట్లు చర్చ
సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): నగరంలో దారిదోపిడీకి పాల్పడిన ఇద్దరు పోలీసులకు వత్తాసు పలికి తాను ఆ సమయంలో డ్యూటీలో లేనట్లుగా చూపించుకునే ప్రయత్నం చేసిన ఫిల్మ్‌నగర్ ఎస్ఐ సలీంపై వేటు పడింది. ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అతనిని వీఆర్‌కు అటాచ్ చేస్తూ..ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 4న షేక్‌పేట వద్ద జరిగిన ఘటనలో ఒక వ్యక్తి దగ్గర డబ్బులున్నాయని గుర్తించిన ఫిల్మ్‌నగర్ కానిస్టేబుల్ మల్సూర్, హోంగార్డ్డు వి. మోహన్‌గౌడ్ తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, అతను తనకు అత్యవసరం ఉండి తన స్నేహితుడి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నానని చెప్పారు.
అయినా వినకుండా జీపు ఎక్కాలంటూ.. బెదిరించి అతని చేతి నుంచి డబ్బుల బ్యాగు లాక్కుని అందులో రూ.50వేలు తీసుకుని పంపించారు. బాధితుడు ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్లో ఆ ఇద్దరు పోలీసులపై ఫిర్యాదు చేయడంతో మల్సూర్ పరారయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో సలీంను తప్పించడానికి ఒకరిద్దరు అధికారులు ప్రయత్నించడంతో పాటు డ్యూటీ రిజిస్టర్లో ఆ రోజు అతని పేరు లేకుండా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’ దగ్గర ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ సలీం డైరెక్షన్లోనే ఈ దోపిడీ వ్యవహారమంతా జరిగిందని, ఇందులో కానిస్టేబుల్ వాటానుంచి అతనికీ వాటా ముట్టిందని తెలిసింది. అయితే డ్యూటీ రిజిస్టర్లో అతని పేరు లేకపోవడంతో పాటు స్పాట్లో అతను లేడంటూ ఉన్నతాధికారులు చెప్పారు. నమస్తే తెలంగాణలో కథనాలు వచ్చిన తర్వాత సీపీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఎస్బీ విచారణలో ప్రాథమికంగా సలీంపై పలు ఫిర్యాదులు ఉండడం, అతనికి ఈ దోపిడీలో భాగమెంత అనే దానిపై పూర్తి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో సబ్ఇన్స్పెక్టర్ సలీంను వీఆర్‌కు అటాచ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
సలీం తీరుపై పోలీసుల్లో చర్చ!
ఈ ఉదంతంపై హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. పోలీసులే దారిదోపిడీకి పాల్పడడం, ప్రత్యేకించి వారికి సంబంధించని సెక్టార్లో ఒక స్వెట్టర్ కొనుక్కోవడానికి వెళ్లి అక్కడ డబ్బులు లెక్కపెట్టుకుంటున్న వ్యక్తిని టార్గెట్ చేసి డబ్బులు లాక్కోవడం పోలీసు శాఖకే అప్రతిష్ట తెచ్చిందంటూ.. పలువురు ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరెవరు భాగస్వాములయ్యారో వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ ఒక సీనియర్ అధికారి కోరారు.
సలీంపై మొదటినుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ మరో ప్రత్యేక కేసులో పనిచేస్తుండడంతో అక్కడి మరో అధికారితో కలిసి పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు చేపట్టినట్లుగా పోలీసు స్టేషన్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను పెద్దసారు మనిషినని, తనను ఎవరైనా టచ్ చేస్తే వారికే కరెంట్ షాక్ కొడుతుందంటూ.. సలీం చాలాసార్లు స్థానిక పోలీసులను బెదిరించినట్లు కూడా చెప్పుకొంటున్నారు. అంతేకాకుండా ఫిల్మ్‌నగర్‌లో తన పరిధిలో ఉన్న సెక్టార్ కంటే ఇతర సెక్టార్లలోనే ఆయన ఎక్కువ సెటిల్మెంట్లు చేసినట్లు ఆ జోన్లోనే చర్చ జరుగుతోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

