Farmer Commission | బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్‌ను తనిఖీ చేసిన రైతు కమిషన్
Farmer Commission | సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ను రైతు కమిషన్ బృందం బుధవారం ఉదయం 6గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేసింది. దాదాపు గంటన్నరపాటు మార్కెట్లో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీసింది.
Farmer Commission | సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్‌ను రైతు కమిషన్ బృందం బుధవారం ఉదయం 6గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేసింది. దాదాపు గంటన్నరపాటు మార్కెట్లో పర్యటించి అక్కడ సమస్యలను తెలుసుకోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యంపై ఆరా తీసింది. వివిధ రాష్ట్రాల నుంచి మార్కెట్‌కు వచ్చిన వ్యాపారులతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీరెడ్డి మాట్లాడారు. గత నాలుగురోజులుగా మార్కెట్ సెక్రటరీ అందుబాటులో లేడని తెలియడంలో కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో రైతుల నుంచి కొనుగోళ్లు, అమ్మకాలపై కమిషన్ ఆరా తీసింది. అధికారుల చాంబర్లు, రసీదులు, అటెండెన్స్ రిజిస్టర్, రికార్డులను కమిషన్ పరిశీలించింది. అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన డేటాను సైతం కమిషన్ సేకరించింది. బయో గ్యాస్ ప్లాంట్‌ను పరిశీలించారు. ప్లాంట్ పనిచేయకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్‌కు చెన్నై, నెల్లూరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఉత్పత్తులు వస్తున్నట్లు కమిషన్ సభ్యులకు రైతులు తెలిపారు. కమిషన్ వెంట హరి వెంకట ప్రసాద్, మహేశ్ ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

