లంకెబిందెలు దొరికాయి..తక్కువ ధరకే అమ్మేస్తాం..

హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద విజిటింగ్కార్డులు సేకరించి ఫోన్లు
అసలైన బంగారమంటూ మోసం
కర్ణాటక, ఏపీకి చెందిన గ్యాంగ్ అరెస్ట్
రూ. 15 లక్షలు స్వాధీనం
“పొలంలో తవ్వకాలు జరుపుతుండగా లంకె బిందెలు దొరికాయి.. మాకు అత్యవసరంగా డబ్బు అవసరముంది.. మీకు తక్కువ ధరకే బంగారు ఆభరణాలు అమ్ముతాం” అంటూ నమ్మించి నగర వ్యాపారిని మోసం చేసిన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ అంజనీకుమార్ వివరాలను వెల్లడించారు.
చాంద్రాయణగుట్టలోని బండ్లగూడ పటేల్‌నగర్‌కు చెందిన కె.విజయ్‌కుమార్ అనే వ్యాపారి కేఎల్ఎం లాజిస్టిక్స్ అండ్ బస్ టికెట్ బుకింగ్ పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత నెలలో సదరు వ్యాపారి విమాన టిక్కెట్ క్యాన్సిల్ కోసం వెళ్లిన సమయంలో ఓ ముఠా కలిసి.. విజిటింగ్ కార్డు తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత (మార్చి 9న) ఆ వ్యాపారికి ఫోన్ చేశారు. “మాది మైసూర్.. పొలం దున్నుతుండగా లంకెబిందెలు(బంగారు ఆభరణాలు) లభించాయి.. మాకు ఎవరూ తెలియదు.. మీ కార్డు ఉండటంతో మీకు ఫోన్ చేశాం.. మాకు డబ్బు అత్యవసర ముంది.. మీకు తక్కువ ధరకే ఆభరణాలను ఇస్తాం” అని నమ్మించారు. నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చి బండ్లగూడ కట్టమైసమ్మ ఆలయ సమీపంలో సదరు వ్యాపారిని కలిశారు. తమ వద్ద కిలో బంగారం ఉందని, ఈ ఆభరణాల షాంపిల్స్‌ను పరీక్షించుకోవాలంటూ నాలుగు కడ్డీలను అతడికి ఇచ్చారు. వ్యాపారి పరీక్షలు చేయించగా అసలైన బంగారమని తేలింది. దీంతో వాళ్ల వద్ద ఉన్న కిలో బంగారాన్ని, రూ. 17 లక్షలు ఇచ్చి తీసుకున్నాడు. పది రోజుల తరువాత వాటిని కరిగించగా.. అవి నకిలీవని తేలింది. దీంతో బాధితుడు చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇత్తడికి మెరుగులు దిద్ది..
- డీఐ ప్రసాద్ వర్మ, ఎస్సై గౌస్ ఖాన్ల నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
- మోసం జరిగిన తీరును పరిశీలించి.. నిందితులు కర్ణాటక వాసులుగా గుర్తించారు.
- కర్ణాటక రాష్ట్రంలోని కొలార్ జిల్లాకు చెందిన డ్రైవర్ శివయ్య, వ్యసాయం చేసే తిరుపతయ్య, ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన డ్రైవర్ ఇంద్రాజ్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు.
- ఈ ముఠా తరచూ హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, రెస్టారెంట్ల వద్దకు వెళ్లి పలువురితో మాట్లాడి.. వారి విజిటింగ్ కార్డులు తీసుకుంటారు..
- కొన్ని రోజుల తర్వాత ఆ కార్డులోని నంబర్‌కు ఫోన్‌చేసి.. తక్కువ ధరకే బంగారు ఆభరణాలను అమ్ముతామంటూ నమ్మిస్తారు..
- ఇందుకు చిన్న చిన్న ఇత్తడి వస్తువులకు బంగారం కోటింగ్ ఇచ్చి నకిలీ బంగారాన్ని తయారు చేసి అంటగడుతుంటారు…
- ఈ క్రమంలో చాంద్రాయణగుట్టకు చెందిన వ్యాపారి వారిబారినపడి మోసపోయాడు..
- ఈ ముగ్గురు నిందితులను శనివారం అరెస్ట్ చేశారు.
- సమావేశంలో సౌత్‌జోన్ డీసీపీ గజారావు భూపాల్, ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మాజీద్, ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fake gold fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

