వెంగళరావునగర్, జూలై 28: అమెరికాకు చెందిన ప్రసిద్ధి దుస్తుల కంపెనీ లెవైస్, రాప్పా లౌరెన్, పోలో బ్రాండ్ల పేరిట నకిలీ వస్ర్తాలను విక్రయిస్తున్న ఓ బట్టల షోరూం నిర్వాహకులపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం… వెంగళరావునగర్ కూడలి సమీపంలోని ైస్టెలిష్ లుక్స్ షోరూంలో లెవైస్, రాల్పా లౌరెన్ పోలో బ్రాండ్ల పేరిట నకిలీ టీ- షర్టులు, షర్టులు విక్రయిస్తున్నట్లు వీఎస్కే గ్లోబల్ సర్వీసెస్ విచారణ అధికారి సయ్యద్ మహమ్మద్ ఫారూఖీ ఫిర్యాదు చేయగా, పోలీసులు షోరూం నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.