స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలు భద్రం
పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల క్రతువును ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
- 45 రోజుల తర్వాత ఐదేండ్ల పాటు ఎన్నికల సంఘం ఆధీనంలోకి
సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ ): పార్లమెంట్ ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు ఎన్నికల క్రతువును ముగించారు. అయితే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేల్చిన ఈవీఎంలను మాత్రం పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, వీవీప్యాట్లలోని స్లిప్పులు, మాక్‌పోల్ ధ్రువపత్రాలు, పీఓ డైరీ, టెండర్ బ్యాలెట్ పేపర్, తదితర ఎన్నికల సామగ్రిని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచి తాళాలు వేసి సీల్ వేశారు. ఈవీఎంల భద్రతకు ఎన్నికల సంఘం అధికారులు స్ట్రాంగ్ రూమ్‌లలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తర్వాత 45 రోజుల పాటు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఈవీఎంలకు భద్రత కల్పిస్తారు. అనంతరం వాటిని ఎన్నికల సంఘానికి అప్పగించి గోదాములకు చేర్చుతారు. ఎన్నికల సంఘం నియమించిన ఇంజినీర్లు వచ్చి వాటిలోని డేటాను తొలగించి అవసరాన్ని బట్టి దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అక్కడికి తీసుకువెళ్లి ఉపయోగిస్తారు.
ఐదేండ్లలో ఆ సమయంలో అవి కీలకం..
అభ్యర్థుల మధ్య ఎన్నిక పోటాపోటీగా జరిగినప్పుడు గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లు కీలకమవుతాయి. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన అభ్యర్థులు ఎప్పుడైనా ఓట్లను మళ్లీ లెక్కించాలని న్యాయస్థానాలకు వెళ్లవచ్చు. అంతేకాదు ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత గెలిచిన అభ్యర్థిపై ఓడిన వారు ఎప్పుడైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపు సమయంలో ఏవైనా అవకతవకలు జరిగాయని సదరు అభ్యర్థులు భావించి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అభ్యర్థులకు న్యాయం చేయడానికి ఈవీఎంల కంట్రోల్ యూనిట్లలో నిక్షిప్తమైన ఓట్లను మళ్లీ లెక్కించాలని న్యాయస్థానం ఆదేశించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇవి కీలకం అవుతాయి. ఏ నియోజకవర్గంలో ఫిర్యాదు అందితే దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్లలో ఓట్లను తక్షణమే లెక్కించడానికి వీలుగా అధికారులు ఈవీఎంలను భద్రపరిచారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

