Uppal Skywalk | ఉప్పల్, ఏప్రిల్ 17 : ఉప్పల్ రింగ్ రోడ్డులోని పోలీస్‌స్టేషన్ సమీపంలో స్కైవేకు వెళ్లే ఎస్కలేటర్ పనిచేయడం లేదు. ప్రారంభించి నెలలు గడుస్తున్నా.. అందుబాటులోకి రాకపోవడంతో మెట్రోకు వెళ్లే ప్రయాణికులు, పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కొన్ని సార్లు లిప్టులు కూడా పనిచేస్తలేవు. అలాగే మెట్ల ద్వారా స్కైవేకు చేరుకొని, ఇతర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఎస్కలేటర్‌ను అందుబాటులోకి తీసుకురావడం పై అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు, పాదచారులు కోరుతున్నారు.