Elevated Corridors | ఎలివేటెడ్ కారిడార్లు ఉన్నట్టా.. లేనట్టా
ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం చేస్తామని ప్రకటించి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులిచ్చి వాటి భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసింది.
- ప్యారడైజ్-దుండిగల్.. ప్యాట్నీ- తూంకుంట
- ఫ్లైఓవర్లను ప్రస్తావించని సర్కారు
Elevated Corridors | సిటీబ్యూరో, జులై 25 (నమస్తే తెలంగాణ) : ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం చేస్తామని ప్రకటించి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులిచ్చి వాటి భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి అవుతున్న వ్యయం 3800 కోట్లు. కాగా ప్రభుత్వం సరిగ్గా పార్లమెంటు ఎన్నికల ముందు హడావుడిగా ఆల్వాల్ టిమ్స్ వద్ద భారీ సభను ఏర్పాటు చేసి శంకుస్థాపన చేశారు. కానీ బడ్జెట్లో మాత్రం వాటి ప్రస్తావన లేకుండా చేశారు.
ఇచ్చిన 700 కోట్లలో…
హైదరాబాద్ పరిధిని విస్తరిస్తామంటూ నగరంలో ఆధునాతన సదుపాయాలు, మౌలిక వసతుల నిర్వహణ విభాగమైన హెచ్ఎండీఏ ఈ ఏడాదికి గాను 1600 కోట్లు కావాలంటూ బడ్జెట్ ప్రతిపాదనలు పంపింది. కానీ ప్రభుత్వం 700 కోట్లే కేటాయించింది. ఇందులో 200 కోట్లు ఔటర్ రింగు రోడ్డు రుణాల చెల్లింపుకే సరిపోనున్నాయి. ఇక మిగిలిన 500 కోట్లను వేటికి ఖర్చు చేయాలో స్పష్టత లేదు. హైదరాబాద్‌ను విశ్వనగరంలో తీర్చిదిద్దే క్రమంలో లింక్ రోడ్లు, స్పైక్ రోడ్లతోపాటుగా హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను హెచ్ఎండీఏ చేపట్టింది.
ఈ క్రమంలో ప్యారడైజ్, ప్యాట్నీల వద్ద 2 భారీ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించతలపెట్టింది. వీటికి 3800 కోట్లు కానుంది. శంకుస్థాపన చేశారు కానీ ఇప్పటికీ పరిహారం రక్షణ శాఖకు కేటాయించాల్సిన భూముల ఎంపిక కూడా పూర్తి కాలేదు. భూ బదలాయింపులు జరిగితే గానీ, ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. అదే గనుక జరిగితే… భూ బదలాయింపులతో జరిగే జాప్యం ఆ 2 ప్రాజెక్టులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

