వాట్సాప్‌లో e చలాన్లు
ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు వేగంగా ఈ చలాన్‌ను పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాట్సాప్‌ను ఉపయోగించనున్నారు.
- ఆర్టీఏ నుంచి వాహనదారుల డాటా సేకరణ
- ఉల్లంఘన ఫొటో సహా.. వాట్సాప్‌కు చలాన్
- వారంలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు
సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ):ట్రాఫిక్ ఉల్లంఘనదారులకు వేగంగా ఈ చలాన్‌ను పంపించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాట్సాప్‌ను ఉపయోగించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 80 లక్షల మంది వాహనదారులుండగా.. ఆర్టీఏ విభాగం నుంచి ఆయా వాహనాల డాటాను సేకరిస్తున్నారు. వాట్సాప్ ఉపయోగించే వారికి ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని పంపించనున్నారు. దీనిపై ట్రాఫిక్ ఈ చలాన్ విభాగంలో ముమ్మర కసరత్తు సాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేసే యోచనలో ఉన్నారు.
ఫొటోతో సహా.. వాట్సాప్‌కు చలాన్..!
ట్రాఫిక్ ఉల్లంఘనలను వివిధ రకాలుగా రికార్డు చేస్తుంటారు. డిజిటల్ కెమెరాలు, ఐటీఎంఎస్, స్పీడ్‌గన్స్, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీసీసీసీ) నుంచి ట్రాఫిక్ ఉల్లంఘనలు గుర్తించి చలాన్లు జారీ చేస్తుంటారు. ఇందులో ఐటీఎంఎస్, స్పీడ్‌గన్స్, టీసీసీసీ నుంచి జారీ అయ్యే చలాన్లు వెంటనే సర్వర్లోకి అప్లోడ్ అవుతుంటాయి. డిజిటల్ కెమెరాల్లో రికార్డు చేస్తే ఆ రోజు సాయంత్రానికి సర్వర్‌లో అప్లోడ్ చేస్తుంటారు. సర్వర్లోకి రికార్డు కాగానే, ఆ వాహనదారుడి నంబర్‌కు వాట్సాప్ ఉంటే జనరేట్ అయిన చలాన్ ఫొటోతో సహా చేరుతుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- e-challans
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

