మద్యం మత్తులో హత్య
సెల్‌ఫోన్ పగులగొట్టాడని స్నేహితుడి గొంతుకోసి హతమార్చిన సంఘటనలో నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... బల్కంపేట ఎస్ఆర్ నగర్లో నివాసముండే కుప్పాక శ్రీనివాసరావు స్థానికంగా ప్లెక్సీ ఫిట్టింగ్ పని చేస్తున్నాడు
- నిందితుడు అరెస్టు
పీర్జాదిగూడ, ఆగస్టు 4: సెల్‌ఫోన్ పగులగొట్టాడని స్నేహితుడి గొంతుకోసి హతమార్చిన సంఘటనలో నిందితుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం… బల్కంపేట ఎస్ఆర్ నగర్లో నివాసముండే కుప్పాక శ్రీనివాసరావు స్థానికంగా ప్లెక్సీ ఫిట్టింగ్ పని చేస్తున్నాడు. కరీంనగర్‌కు చెందిన కొలిపాక శ్రీనివాస్ అలియాస్ వాసు (43) బోడుప్పల్ భీంరెడ్డినగర్ కాలనీలోని అరుణ్ యాడ్స్ షాపులో ప్లెక్సీ ఫిట్టింగ్ వర్క్ చేస్తుంటాడు.
వీరిద్దరు స్నేహితులు. తరచుగా ఇద్దరు కలిసి మద్య సేవించేవారు. ఈ క్రమంలో ఆగస్టు 1న రాత్రి 9 గంటల సమయంలో శ్రీనివాస్‌రావు వాసు వద్దకు వచ్చాడు. వీరిద్దరు రాత్రి పొద్దుపోయే వరకు మద్యం సేవించారు. మద్యమత్తులో ఇరువురి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో శ్రీనివాస్‌రావు వాసు సెల్‌ఫోన్‌ను పగులగొట్టాడు. అనంతరం సమీపంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో మూత్రవిసర్జనకు వెళ్లగా వాసు వెనుకనుంచి వెళ్లి ప్లెక్సీలు కటింగ్ చేసే కత్తితో శ్రీనివాస్‌రావు గొంతుకోసి హతమార్చి పారిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు వాసును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cell phone
- damaging
- Drunkard
- Friend
RELATED ARTICLES
తాజా వార్తలు
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

