హృదయం గలవారే సాయం చేస్తారు

తెలుగుయూనివర్సిటీ, మే 4: దయార్థ్ర హృదయం గలవారే కళాకారులకు సాయం చేయగలరని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జానపద కళాకారులకు నగదు పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఏసీ గార్డ్స్ – నఫీస్ రెసిడెన్సీలోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమం చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వందమంది కళాకారులకు లక్ష రూపాయల నగదును రమణాచారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ స్ఫూర్తితో మరింత మంది కళాకారులను ఆదుకునేందుకు కరోనా విపత్కర పరిస్థితిలో ముందుకు రావాలని రమణాచారి ఆకాంక్షించారు.
సాయం చేయడం దేవుడిచ్చిన వరంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన యువ కళావాహిని అధ్యక్షులు వైకే నాగేశ్వరరావుకు సభ సంతాపం తెలిపింది. వైకే లేని లోటు తీరదని ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కార్యవర్గ సభ్యులకు రమణాచారి సూచించారు. కార్యక్రమంలో కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ, యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు బొప్పన నరసింహారావు, జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- dr kv ramanachary
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

