నిలోఫర్‌ను సందర్శించిన డీఎంఈ

సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని నిలోఫర్‌లో చేపడుతున్న ఏర్పాట్లను వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ రమేష్‌రెడ్డి పరిశీలించారు. మంగళవారం నిలోఫర్ దవాఖానకు చేరుకున్న ఆయన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, కొవిడ్ నోడల్ అధికారి, ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ దాంపురి, ఆర్ఎంఓ డాక్టర్ లల్లూప్రసాద్ రాథోడ్‌లతో కలిసి నిలోఫర్ పాత భవనంతో పాటు ఇన్ఫోసిస్బ్లాక్లను సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వెయ్యి పడకల కరోనా బ్లాక్‌కు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఇన్ఫోసిస్ బ్లాక్‌లో సత్వరం ఏర్పాటు చేస్తున్న 150 ఆక్సిజన్ పడకలు, వెంటిలెటర్ల ఏర్పాట్ల వివరాలను సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పిల్లలపై కరోనా ప్రభావం లేనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిలోఫర్ వైద్యాధికారులకు సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- DME Ramesh Reddy
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

