అభివృద్ధి దిశగా అంబర్‌పేట

గోల్నాక, జనవరి 17: గతానికి భిన్నంగా సరికొత్త అందాలతో అంబర్‌పేట నియోజకవర్గం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పక్కా ప్రాణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. సోమవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో కొనసాగుతున్న ఫుట్‌పాత్, డివైడర్ల అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అంబర్‌పేట సీపీఎల్ రహదారి, బాగ్ అంబర్‌పేట శివం రోడ్డు, బర్కత్‌పుర ప్రధాన రహదారులు, నల్లకుంట ఫీవర్ దవాఖాన నాలా బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఫుట్‌పాత్‌లపై పలు రకాల మొక్కలు నాటి పాదచారులకు ఆహ్లాదకరమైన వాతావరణం పెంపొందించాలని సంబంధిత అధికారితో పాటు గుత్తేదారుకు ఆయన సూచించారు. డివైడర్ల అభివృద్ధి పనులపై కూడా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గం సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. భవిష్యత్ జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు ఫుట్‌పాత్‌లు, డివైడర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

