జిమ్‌లలో స్టెరాయిడ్స్
డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్‌తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే..
- కండలు పెంచేందుకు ‘మెఫెంటర్మైన్ ఇంజక్షన్లు సరఫరా
- పలు సెంటర్లపై డీసీఏ దాడులు
- ఓ జిమ్ సెంటర్ నిర్వాహకుడి అరెస్టు..
- రూ. 3వేలు విలువైన ఇంజక్షన్లు స్వాధీనం
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు జిమ్ నిర్వాహకులు యువకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దేహదారుఢ్యం కోసం వచ్చే వారికి స్టెరాయిడ్‌తో కూడిన రక్తపోటు పెంచే ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే.. ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగడమే కాకుండా కొన్ని సార్లు ప్రాణాంతకంగా కూడా మారే అవకాశాలున్నట్లు డీసీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పలు జిమ్ సెంటర్లపై పోలీసులతో డీసీఏ అధికారులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఓ జిమ్ నిర్వాహకుడిని అరెస్టు చేసి.. అతడి వద్ద నుంచి మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. డీసీఏ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం…సికింద్రాబాద్‌లోని తాడ్బంద్కు చెందిన ఎండీ ఖాసీం స్థానికంగా జిమ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే తన వద్ద జిమ్‌కు వచ్చే వారికి త్వరగా దేహదారుఢ్యం వృద్ధి చెందడానికి నిబంధనలకు విరుద్ధంగా ‘మెఫెంటర్మైన్ సల్ఫేట్’ ఇంజక్షన్లను విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న డీసీఏ అధికారులు సికింద్రాబాద్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్‌సింగ్, మలక్‌పేట డ్రగ్ ఇన్స్పెక్టర్ అనిల్ బృందం, మార్కెట్ పోలీసులతో కలిసి గురువారం ఖాసీంకు చెందిన జిమ్సెంటర్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఖాసీంను అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి రూ.3వేల విలువ చేసే మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఐదేండ్ల జైలు శిక్ష : డీసీఏ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
దేహదారుఢ్యం కోసం వినియోగించే మెఫెంటర్మైన్ సల్ఫేట్ వంటి ఇంజక్షన్లు తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి. సాధారణంగా శస్త్రచికిత్సల సమయంలో రక్తపోటును పెంచేందుకు వీటిని రోగికి ఇస్తారు. సర్జరీ చేసే సమయంలో వెన్నుముకకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కొందరిలో రక్తపోటు పడిపోతుంది. అలాంటి సమయంలో రక్తపోటును పెంచేందుకు మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు ఇస్తారు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే రోగి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా తగిన మోతాదులో ఈ ఔషధం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి ఇంజక్షన్లను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్కౌట్లు చేసి..దేహదారుఢ్యాన్ని పెంచేందుకు ఈ ఔషధాలను విక్రయిస్తున్నారు. దీని వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలు విక్రయించినా.. నిల్వ చేసినా.. ఐదేండ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

