గ్యాస్.. సామాన్యుల గుదిబండ

- మళ్లీ గ్యాస్ బాదుడు..!
- డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.25 పెంపు
- ఆర్నెల్లలో ఏకంగా రూ.140 పెరుగుదల
సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): ఒకవైపు చమురు ధరల మోతను కొనసాగిస్తున్న ఇంధన సంస్థలు గ్యాస్ పైనా ధరలు పెంచి.. సామాన్యుడిని బాదుతున్నాయి. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సామాన్యుడిపై ఆర్థికంగా భారం పెరుగుతున్నది. ప్రధానంగా గత ఆర్నెల్లలో అటు పెట్రోలు, డీజిల్‌తో పాటు ఇటు గ్యాస్ ధరలు కూడా భారీగానే పెరిగాయి. తాజాగా, చమురు సంస్థలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.25ల మేర పెంచాయి. కమర్షియల్ సిలిండర్‌పై దాదాపు 85.50 మేర అదనపు భారాన్ని మోపుతున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో దాదాపు 25 లక్షల వరకు డొమెస్టిక్ సిలిండర్ కనెక్షన్లు ఉండగా, కమర్షియల్వి సుమారు 50-70 వేల మేరకు ఉన్నాయి. చమురు సంస్థలు తాజాగా పెంచిన ధరతో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.887 చేరగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.1768కు చేరుకుంది. చమురు సంస్థలు గ్యాస్ ధరను పెంచడం గత ఆర్నెల్ల వ్యవధిలో ఇది ఐదోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన డొమెస్టిక్ సిలిండర్‌పై అప్పటి ధర కంటే రూ.25 మేర పెంచిన చమురు సంస్థలు ఆపై అదే నెల 15వ తేదీన రూ.50, 25వ తేదీన రూ.25లు పెంచాయి.
అంటే కేవలం ఫిబ్రవరి నెలలోనే ఏకంగా రూ.100 పెంచాయి. ఆపై మార్చి 25న రూ.25 మేర పెంచిన సంస్థలు, ఏప్రిల్ ఒకటిన మాత్రం రూ.10లు తగ్గించాయి. తిరిగి తాజాగా మరో రూ.25లు పెంచాయి. అంటే గత ఆర్నెల్ల వ్యవధిలోనే డొమెస్టిక్ సిలిండర్‌పై ఏకంగా రూ.140లు పెంచడం సామాన్యుడికి గుదిబండలా మారింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- cylinder price hike
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

