క్రిప్టో జోలికి పోకండి
మోసం చేసేందుకు సైబర్‌నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్‌తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తారు. ఆ తర్వాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి.. నిండా ముంచేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ కొనడం, అమ్మడం, ట్రేడింగ్ చేసేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి.
- అసలైన వెబ్సైట్లకు దీటుగా సొంత వెబ్సైట్లు సృష్టిస్తున్న సైబర్‌నేరగాళ్లు
- జాగ్రత్త పాటించకపోతే మోసం తప్పదు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మోసం చేసేందుకు సైబర్‌నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్‌తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తారు. ఆ తర్వాత భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి.. నిండా ముంచేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ కొనడం, అమ్మడం, ట్రేడింగ్ చేసేందుకు కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. ఆయా వెబ్సైట్ల ద్వారా ట్రేడింగ్ చేస్తున్నారు. నమ్మకం, అసలైన క్రిప్టో వెబ్సైట్ల ద్వారానే బాధితుల నుంచి క్రిప్టో కొనిపిస్తున్నారు. తమ సొంత వెబ్సైట్లలో ఆ క్రిప్టోను పెట్టుబడిగా పెట్టించి.. దానితో ట్రేడింగ్ ఆడితే నిమిషాల వ్యవధిలోనే వేలు సంపాదించవచ్చంటూ బాధితులను నమ్మిస్తున్నారు. ఇటీవల దుండిగల్‌కు చెందిన ఒక బాధితుడితో క్రిప్టో ట్రేడింగ్ చేయించి.. ఒక్కో ట్రేడ్ 180 సెకెండ్లలో ఉంటుందనీ, అందులో 100 డాలర్లు సంపాదించవచ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు రూ. 40 లక్షలు దోచుకున్నారు.
స్వీట్‌గా చెప్పి..
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో సైబర్‌నేరగాళ్లు తమ సొంత వెబ్సైట్లను ఉపయోగిస్తారు. అయితే, బాధితుల నుంచి క్రిప్టో కొనిపించే సమయంలో మాత్రం అసలైన క్రిప్టో వెబ్సైట్లను వినియోగిస్తున్నారు. బియాన్స్ అనే ఒక అసలైన వెబ్సైట్ నుంచి క్రిప్టో కొనిపిస్తారు. బాధితుడు కొనుగోలు చేసే కరెన్సీకి ఒక నంబర్ ఉంటుంది. అదే నంబర్‌తో క్రిప్టో ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది. బాధితులు బియాన్స్ నుంచి కొనడం వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత తమ సొంత వెబ్సైట్లలో ట్రేడింగ్ చేయమని చెప్పడంతోనే మోసం మొదలవుతుంది. సైబర్‌నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ సొంత అవసరాలకు తగ్గట్టుగా వెబ్సైట్లు తయారు చేస్తుంటారు. ఒక్కో మోసానికి ఒక్కో రకమైన వెబ్‌సైట్‌ను తయారు చేస్తూ బాధితులకు పంపిస్తుంటారు. తమ వెబ్సైట్లో ట్రేడింగ్ చేయండి.. అని చెప్పి, అందులో ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాభం కూడా స్క్రీన్‌పై కనిపించే విధంగా ఏర్పాట్లు చేస్తారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వాలెట్ నంబర్‌ను తాము చెప్పే వెబ్సైట్లో ఎంట్రీ చేయమని బాధితులకు చెబుతారు. ఈ నంబర్ వారి చేతికి వెళ్లగానే బాధితులను ముంచేస్తున్నారు.
క్రిప్టోతో జాగ్రత్త..!
క్రిప్టో కరెన్సీతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పేరున్న నమ్మకమైన సైట్ల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. ఆ సైట్లలోనేవిక్రయించాలి. కానీ, ట్రేడింగ్‌తో ఎక్కువ లాభాలొస్తాయనే ఆశతో ఇతరులు చెప్పే మాటలు నమ్మి, లక్షలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. క్రిప్టో వాలెట్ నంబర్ ఎవరి వద్ద ఉంటే వాళ్లే దానికి యజమానులు. దీంతో క్రిప్టో నంబర్‌ను ముందుగా తమ వెబ్సైట్లలో ఎంట్రీ చేయించి, సైబర్ నేరగాళ్లు దొంగిలిస్తుంటారు. దీనిపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

