రూ.599 రీచార్జ్.. రూ.1.25 లక్షలు లూటీ..!
నెట్ఫ్లిక్స్రీచార్జ్ చేసుకోవాలంటూ సందేశాన్ని పంపించి బాధితుడిని నమ్మించిన సైబర్ దొంగలు రూ.1.25 లక్షలు కాజేశారు. సకాలంలో స్పందించిన ముషీరాబాద్ పోలీసులు 12గంటల్లో కేసు ఛేదించి తిరిగి బాధితుడి ఖాతాలో ఆ సొమ్మంతా జమ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే
- 12 గంటల్లో కేసును ఛేదించిన సైబర్ క్రైం పోలీసులు
- బాధితుడి ఖాతాలో చోరీ సొత్తు జమ
సిటీబ్యూరో, జులై 22 ( నమస్తే తెలంగాణ): నెట్ఫ్లిక్స్రీచార్జ్ చేసుకోవాలంటూ సందేశాన్ని పంపించి బాధితుడిని నమ్మించిన సైబర్ దొంగలు రూ.1.25 లక్షలు కాజేశారు. సకాలంలో స్పందించిన ముషీరాబాద్ పోలీసులు 12గంటల్లో కేసు ఛేదించి తిరిగి బాధితుడి ఖాతాలో ఆ సొమ్మంతా జమ చేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం రాత్రి విధుల్లో ఉన్న అతడికి మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ రీచార్జ్చేసుకోవాలని మెయిల్ వచ్చింది. నిజంగానే రీచార్జ్ చేయాల్సి ఉన్నందున బాధితుడు ఈమెయిల్‌ను చెక్ చేయకుండానే రీచార్జ్ లింక్‌ను క్లిక్ చేశాడు. నెట్‌ఫ్లిక్స్ లానే ఉన్న పేజీ, అందులో పేమెంట్‌కు సంబంధించి ఫారం ఓపెన్ కావడంతో అందులో బాధితుడి క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేశాడు.
ఓటీపీ సైతం నమోదు చేశాడు. అయితే రీచార్జ్ మొత్తం రూ.599 ఉండగా.. ఖాతానుంచి రూ.1.20 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన బాధితుడు కార్డు బ్లాక్ చేసి, సంబంధిత కార్డు బ్యాంకుకు, తెలంగాణ సైబర్ క్రైం సెల్‌కు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న సైబర్ క్రైం పోలీసులు సయ్యద్ ముబీన్, శ్రీకాంత్ నాయక్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. చోరీ సొత్తుతో నిందితుడు ఈకామర్స్ సైట్లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న ఈకామర్స్ సైట్ కూడా సకాలంలో స్పందించి ఆభరణాన్ని సైబర్ దొంగకు పంపకుండా ఆపేశారు. అనంతరం రూ.1.25లక్షలు బాధితుడు శ్రీనివాస్ ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం పోలీసులు మాట్లాడుతూ సైబర్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

