Crime news | బోయిన్‌పల్లిలో విషాదం.. కుటుంబ కలహాలతో తండ్రీ బిడ్డల ఆత్మహత్య
Crime news | సికింద్రాబాద్ సిటీలోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోగల భవానీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రీ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బోయిన్పల్లి: సికింద్రాబాద్‌లో సిటీలోని బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోగల భవానీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో తండ్రీ ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన బిడ్డలిద్దరికీ నిద్ర మాత్రలు ఇచ్చిన తండ్రి తాను కూడా తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులను తండ్రి శ్రీకాంత్ చారి (42), కుమార్తెలు స్రవంతి (8), శ్రావ్య (7) గా పోలీసులు గుర్తించారు. కాగా కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి తగాదాలు లేవని శ్రీకాంత్ చారి భార్య తెలిపింది.
రాత్రి భోజనం తర్వాత అందరం మాట్లాడుకుంటూ పడుకున్నామని, తెల్లారి చూసేసరికి తన భర్త, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారని ఆమె చెప్పింది. అదేవిధంగా తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని శ్రీకాంత్ చారి తల్లి జయమ్మ తెలిపింది. అయితే ఈ మధ్య శ్రీకాంత్ వ్యాపారం సరిగా నడవడం లేదని జయమ్మ వెల్లడించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

