ప్రాథమిక విధులను మరువొద్దు..
హైదరాబాద్ నగర పోలీసులు తమ ప్రాథమిక విధులను మరవొద్దని, విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు.
- పోలీస్ వ్యవస్థకు భంగం కలిగిస్తే చర్యలు
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించం..
- అధికారుల సమీక్షా సమావేశంలో సీపీ సజ్జనార్
సిటీబ్యూరో, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగర పోలీసులు తమ ప్రాథమిక విధులను మరవొద్దని, విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సీనియర్ పోలీస్ అధికారులు, ఎస్హెచ్ఓలతో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల నిర్వహణ, నేరాల నియంత్రణ దర్యాప్తు, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ టెక్నాలజీ వినియోగం, మావనవనరుల నిర్వహణ, తదితర అంశాల ప్రాధాన్యతను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరిస్తూ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగించేలా పోలీస్ అధికారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు ప్రజల భద్రతే ధ్యేయంగా మెరుగైన పోలీసింగ్ చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారి వందశాతం తమ బాధ్యతను నిబద్దతతో, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. సిబ్బందిని కేవలం ఒకే పనికి పరిమితం చేయొద్దని, అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యత సంపాదించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తమ పరిధిలో జరిగే ప్రతి విషయానికి సంబంధిత ఎస్హెచ్ఓలదే బాధ్యత వహించాలని, గతంలో కొన్ని కేసు ల్లో నిర్లక్ష్యం వహించినట్లు తన దృష్టికి వచ్చిం దని, ఆయా కేసులను మళ్లీ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అన్ని కేసులను రొటీన్‌గా తీసుకోవద్దని, ప్రతి చిన్న నేరాన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలంటూ.. చిన్నచిన్న నేరాలకు చెక్ పెట్టకపోతే భవిష్యత్‌లో అది పెద్దనేరానికి దారి తీస్తుందని, ప్రీ కేసును సాంకేతికంగా అన్ని కోణాల్లో విశ్లేషణ చేయాలన్నారు. దర్యాప్తును వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతికత ఏఐ వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని, దీనిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఇటీవల వరుసగా పోలీసులపై వస్తున్న ఆరోపణలపై కూడా సీపీ సీరియస్‌గా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే సహించమంటూ అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాస్, లా అండ్ అర్డర్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడ్మిన్ జా యింట్ సీపీ పరిమళహానానూతన్, డీసీపీలు శ్వేత, అపూర్వారావు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

