సేవా పతకాలను పొందిన 27 మంది హోంగార్డులు

సిటీబ్యూరో, అగస్టు 21(నమస్తే తెలంగాణ): అతి ఉత్కృష్ట, ఉత్కృష్ట సేవా పతకాలను పొందిన 27 మంది హోంగార్డులను శనివారం సీపీ అంజనీకుమార్ అభినందించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డు సిబ్బంది సేవలు, సహకారంతో శాంతి భద్రతలను సమర్థవంతంగా, పటిష్టంగా నిర్వహిస్తున్నామని సీపీ చెప్పారు. సుమారు 1106 హోంగార్డులు కొవిడ్ బారిన పడి కోలుకున్నారన్నారు. హూస్సేన్సాగర్ లేక్ వద్ద ఏటా ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సుమారు 100 మందిని హోంగార్డులు కాపాడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ మూర్తి, హోంగార్డ్ ఏసీపీ నాగసాయి, హోంగార్డు అడ్మిన్ ఇన్స్పెక్టర్ విజయ్భాస్కర్రెడ్డి, ఆర్ఐలు నాగారాజు, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

