ప్రణాళికతో..సవాళ్లను అధిగమించాలి
రాష్ట్ర రాజధానిలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సైబర్‌నేరాలు తగ్గించడం, నేరాలను అడ్డుకోవడంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పక్కా
- సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీపీ ఆనంద్
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సైబర్‌నేరాలు తగ్గించడం, నేరాలను అడ్డుకోవడంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పక్కా ప్రణాళికతో అన్ని విభాగాలు ముందుకు వెళ్లాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆయా విభాగాల అధిపతులకు దిశా నిర్దేశం చేశారు. బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ భవనంలో సీవీ ఆనంద్ అధ్యక్షతన శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్, హెచ్‌న్యూ తదితర విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ ఏడాది హైదరాబాద్ పోలీస్‌ల సైబర్ క్రైమ్ వింగ్ సామర్థ్యం పెరిగిందన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో యాంటీ డ్రండ్ కమిటీలు(ఏడీసీ)లను ప్రారంభించాలని అన్ని జోన్ల డీసీపీలకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ మతాలకు చెందిన పండుగలు, ఉరేగింపులు ఒకే తేదీలలో జరుగుతుండడంతో, ప్రజలతో సత్ససంబంధాలు కొనసాగిస్తూ, చురుకైన యువతను శాంతి కమిటీలలోకి తీసుకొని ఆయా కమిటీలను పునర్వ్యవస్తీకరించడంపై దృష్టి పెట్టాలన్నారు. తప్పు చేసిన నేరస్తులపై పీడీయాక్టులు పెట్టాలని, నేరాలు చేసే విదేశీయులను బహిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, ఏఆర్ శ్రీనివాస్, సుధీర్‌బాబు, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, ఎం. శ్రీనివాస్, పరిమళ, నూతన్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

