కంటోన్మెంట్ దవాఖానలో కొవిడ్ సేవలు

అవసరమైతే ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతాం
దవాఖానను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బొల్లారం, మే 12 : కొవిడ్ నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం కంటోన్మెంట్ దవాఖానలో కొవిడ్ చికిత్సా కేంద్రం ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని రైల్వే, ఈఎస్ఐ, మిలటరీ, ఎయిమ్స్ దవాఖానల్లో పూర్తి స్థాయి కొవిడ్ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 5వేల రైల్వే కోచ్లు, వివిధ ప్లాట్ ఫాంలలో బెడ్స్ ఏర్పాటు చేసి చికిత్స అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విశ్రాంత ఉద్యోగులు, పారామిలటరీ సేవలను ఉపయోగించుకుంటున్నట్లు పేర్కొన్నారు. బొల్లారంలోని కంటోన్మెంట్ దవాఖానలో 60 పడకలతో కొవిడ్ చికిత్సలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అవసరమైతే ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పుతామని చెప్పారు. కంటోన్మెంట్ దవాఖానలో ఉన్న సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా కృషిచేస్తానన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్ రామకృష్ణ, మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, జంపన ప్రతాప్, స్థానిక నాయకులు జైనపల్లి శ్రీకాంత్, ధనుంజయ్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

