కోఠిలోనూ కొవిడ్ సేవలు

- సుల్తాన్ బజార్ ప్రసూతి దవాఖానలో 150 పడకలు
- అన్ని ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ఎంసీ, దవాఖాన పాలక వర్గం
- గర్భవతుల సేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..
- ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ కె.రాజ్యలక్ష్మి
సుల్తాన్‌బజార్, మే 9: కరోనా రోగులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్న గాంధీ, కింగ్‌కోఠి, టిమ్స్ దవాఖానలతో పాటు నగరంలో మరిన్ని చోట్ల ఈ సేవలను విస్తృతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు తగినట్టుగా సుల్తాన్‌బజార్ ప్రసూతి వైద్యశాల కూడా సిద్ధమైంది. ఇక్కడ కూడా అన్ని వసతులతో కొవిడ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. గర్భవతుల వైద్యానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కొవిడ్ సేవల కోసం అదనపు వసతులు ప్రారంభించనున్నారు. దవాఖానలోని నూతన భవనంలో కొవిడ్ రోగులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించే పనులను ప్రారంభించారు. భవనంలోని జీ ప్లస్, మొదటి, రెండు, మూడో అంతస్తులలో పడకలు, ఆక్సిజన్ సరఫరాకు అవసరమయ్యే సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
నాలుగంతస్తుల్లో..
150 పడకలతో ఏర్పాటు చేయనున్న ఈ వసతి కోసం జీహెచ్ఎంసీ, దవాఖాన పాలకవర్గం సమన్వయంతో పని చేస్తున్నాయి. అయితే భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో 40 పడకలతో ఐసీయూను, 20 ఆక్సిజన్, 20 సీ ప్యాక్ వెంటిలేటర్ల పడకలను, మొదటి అంతస్తులో 40 పడకలు, రెండో అంతస్తులో 10, మూడో అంతస్తులో 40 పడకలను అందుబాటులోకి తెస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి తెలిపారు. అయితే భవనంలో ఆక్సిజన్ పైప్‌లైన్ పనులు పూర్తి అయినా ప్లాంట్ లేకపోవడంతో ప్రస్తుతం సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించాలని యోచిస్తున్నామని ఆమె అన్నారు.
గర్భవతులకు ఇబ్బందులు రాకుండా..
- ప్రసూతి దవాఖానకు నిత్యం వైద్య పరీక్షలు, ప్రసవాల కోసం వచ్చే గర్భవతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యాధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
- ఓపి, అడ్మినిస్ట్రేషన్ భవనానికి మధ్యలో నూతన భవనం ఉండటం.. ఈ నూతన భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో లేబర్ రూం ఉండటంతో దాన్ని పాత భవనంలోకి మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
- అంతేకాక గర్భవతులు కొవిడ్ కేంద్రం వైపు రాకుండా ఉండేందుకు పాత భవనం, ఓపీ వైపు బారికేడ్లు పెట్టే ఆలోచనలో ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Covid Hospital
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

