కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న జరిగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- 4న ఓట్ల లెక్కింపు
- జిల్లాలో 16 కౌంటింగ్ కేంద్రాలు, ప్రతి హాల్లో 14 టేబుళ్లు
సిటీబ్యూరో, మే 31, (నమస్తే తెలంగాణ): లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న జరిగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపునకు ప్రతి హాల్ లో 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా పోలింగ్ స్టేషన్లు ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు 20 టేబుళ్లు, మిగతా నియోజకవర్గంలో 14 టేబుళ్లు ఉండనున్నాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్‌కు 10 టేబుళ్లు, హైదరాబాద్ పార్లమెంట్‌కు 14 టేబుళ్లు ఉంటాయి. లెక్కింపు ప్రక్రియలో 1000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. 650 మంది లెక్కింపునకు అవసరం పడుతుండగా, దాదాపు 350 మందిని రిజర్వ్‌లో ఉంచుతున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుపనున్నారు.
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
మేడ్చల్, మే 31(నమస్తే తెలంగాణ): కీసర మండలం భోగారం కళాశాలలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ కేంద్రాన్ని కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించి.. పలు సూచనలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

