మనం మారితేనే.. కరోనా కట్టడి సాధ్యం

- ముమ్మరంగా రసాయనాల పిచికారీ
- బస్తీలు, ప్రధాన కూడళ్లు, జన సాంద్రత ప్రాంతాల్లో హైపోక్లోరైట్ స్ప్రే చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది
- అపరిశుభ్రత లేకుండా చెత్త తొలగింపు
- భయం లేకుండా జనసంద్రంగా మార్కెట్లు
- నిబంధనలు గాలికొదిలేస్తున్న యువత
- ఒక్కరి నిర్లక్ష్యంతో.. ఇంటిల్లిపాదికి పొంచిఉన్న ప్రమాదం
- పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు
- మాస్కులు ధరించాలని సూచన.. లేకుంటే చలాన్
రోజురోజుకూ చాపకింది నీరులా విస్తరిస్తున్న మహమ్మారిని కట్టడి చేయడం ఎలా.. ఇది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. వైరస్ రూపురేఖలు నిర్ధారణ కానప్పటికీ లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్న వైద్యులు మనిషి ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు రెప్పవాల్చకుండా వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. సర్కార్ కూడా వైరస్ కట్టడికి అనుగుణంగానే నిబంధనలు జారీచేస్తున్నది. కట్టడికి ఓ పక్క వైద్యులు, మరో పక్క ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నది. కాని జనం మాత్రం ఏం చేస్తున్నారు. వైద్యుల సూచనలు పక్కన బెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ గాలిలో తేలియాడుతున్న వైరస్‌తో పోటీపడుతున్నారు. ప్రమాదమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా మాస్కులు, భౌతికదూరం, శుభ్రత పాటించకుండా పాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
అబిడ్స్, ఏప్రిల్ 19 : కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు రెండు రోజులుగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయనాల పిచికారీ వేగవంతం చేశారు. చెత్త నిల్వల తొలగింపు పనులను ముమ్మరం చేశారు. ప్రతి బస్తీలో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించి ముగ్గులువేసి అందంగా తీర్చిదిద్దుతూ.. శానిటైజ్ చేస్తున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ప్రధానంగా కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చిన ఇండ్ల సమీపంలో రోజుకు రెండు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేస్తున్నారు. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ఆలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురా బస్తీ దవాఖాన, గోడేకిఖబర్, గోషామహల్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయనాలను పిచికారీ చేశారు.
యువతా మేలుకో.. కుటుంబాన్ని కాపాడుకో..!
ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తున్నప్పటికీ యువత మాస్కులు లేకుండానే నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. కోఠిలోని పలు వ్యాపార సముదాయాల వద్ద గుంపులుగా సంచరిస్తూ.. కరోనా విస్తరణకు కారణమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా కట్టడికి సహకరించాలని ఎంతమొత్తుకున్నా.. ఎవరికీ చెవికెక్కడంలేదని తెలుస్తున్నది. కొందరి నిర్లక్ష్యం మూలంగా ఇంటిల్లిపాది వైరస్ బారిన పడుతున్నారని, ఇందుకు యువత నిర్లక్ష్యమే కారణమని పలువురు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైరస్ చాపకింది నీరులా విస్తరిస్తున్నప్పటికీ విందులు, వినోదాల పేరుతో జల్సాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ.. విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్ వినియోగిస్తూనే కరోనా కట్టడి అవుతుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహమ్మారి తీవ్రత పెరిగి పెద్ద మొత్తంలో ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మాస్కు లేకుంటే చర్యలు తప్పవు..
- పోలీసు అధికారులు సైతం కరోనా కట్టడికి చర్యలు ముమ్మరం చేశారు.
- మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్న వారిని గుర్తించి చలాన్ విధిస్తున్నారు.
- పలు కూడళ్ల వద్ద చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి వాహనాలను ఆపి చెకింగ్ చేస్తున్నారు.
- ద్విచక్ర వాహనదారుడికి హెల్మెట్‌తో పాటు మాస్కు తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు.
- అంతేకాకుండా ఆటోలు, కార్లలో ప్రయాణించే వారు సైతం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని తెలుపుతున్నారు. నిర్లక్ష్యంగా మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతూ మీ ప్రాణాలతో పాటు ఇంట్లో వారి ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టవద్దని కోరుతున్నారు.
- ఒక్కరి నిర్లక్ష్యం మూలంగా వారి కుటుంబంతో పాటు చుట్టుపక్కలవారికి ప్రమాదం పొంచివుందని హెచ్చరిస్తున్నారు.
- తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, శానిటైజర్ విధిగా వాడాలని సూచిస్తున్నారు.
- ముఖ్యంగా అవసరమైతేనే ఇంటినుంచి భయటకు రావాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

