దగ్గినంత మాత్రాన.. కరోనా కాకపోవచ్చు

- ఫ్యాన్ గాలికి ముక్కుపట్టేసినా.. భయపడిపోతున్నారు..!
- అనవసర అనుమానాలొద్దు .. ‘సమ్మటైజేషన్’కు గురికావొద్దు
- సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
- మీ కోసం, మీ కుటుంబం కోసం మాస్క్ తప్పనిసరి
- ‘దగ్గినంత మాత్రాన కరోనా కాకపోవచ్చు.. అనవసర అనుమానాలతో సమ్మటైజేషన్కు గురికావొద్దు.
- కరోనాను ధైర్యంతోనే ఎదుర్కోవాలి. ధైర్యమే కరోనాకు మందు’ అని గత ఏడాది కాలంగా వైద్యులు సూచిస్తున్నారు.
- కాని సోషల్‌మీడియా ప్రభావానికి ప్రజలు మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నారు.
- ఫ్యాన్ గాలికి ముక్కు పట్టేసినా.. కరోనా సోకిందేమోనని ఆందోళన చెందుతున్నారు.
- అయితే కరోనా సెంకడ్ వేవ్.. మొదటి దానికంటే భిన్నంగా ఉందనే వాదనలు వినిపిస్తుండటంతో పాటు కేసుల సంఖ్య సైతం విపరీతంగా పెరుగడంతో ప్రజలు ప్రతి విషయానికి భయపడుతున్నారు.
- కొందరు సోషల్‌మీడియాలో పనిగట్టుకొని మరీ ఆందోళనకు గురిచేసే పోస్టులు పెడుతుండటంతో వీరిలో భయం మరింత రెట్టింపవుతున్నది.
- ఇలాంటి వాటికి దూరంగా ఉంటేనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఆందోళన వద్దు.. ధైర్యమే మందు
- నేడు మనిషిని చూసి మరో మనిషి భయపడే పరిస్థితి. అలాంటి పరిస్థితిని ధైర్యంతోనే ఎదుర్కోవాలి.
- కరోనా కట్టడికి ప్రభుత్వం సూచించిన నిబంధనలు తప్పని సరిగా పాటిస్తే.. 99 శాతం కరోనా ధరిచేరకుండా ఉంటుంది.
- మాస్క్ ధరించాలి, సామాజికదూరం పాటించాలి, తరుచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి,
- అవసరమైతేనే ఇంటినుంచి బయటకు రావాలి.. వీటిని పాటిస్తే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
- సోషల్‌మీడియాలో పలువురి వ్యక్తిగత అభిప్రాయాలను చూసి, అది నిజమని నమ్మి భయపడవద్దు.
- టీవీలు, సోషల్‌మీడియాపై దృష్టి పెట్టకుండా, పౌష్టిక ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని తెలుపుతున్నారు.
సమ్మటైజేషన్కు గురవుతున్నారు
తుమ్ము, దగ్గు సాధారణంగా వస్తుంటాయి. ప్రస్తుతం అవి వచ్చాయంటే మనకు కరోనా వచ్చిందేమోననే భావన చాలా మందిలో ఉన్నది. ఇలాంటి దాన్ని సమ్మటైజేషన్ అంటారు. కరోనాను మనో ధైర్యంతో ఎదుర్కోవాలి. భయపడితే నిద్ర పట్టదు, చిన్న విషయం పెద్దదిగా కన్పిస్తుంది. మాస్క్‌ను సరైన పద్ధతిలో ధరించి, సామాజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో కరోనాను కట్టడి చేసే అవకాశముంది. అయినప్పటికీ కరోనా సోకితే ధైర్యంగా ఎదుర్కోవాలి. పోలీసులు, ప్రభుత్వం కోసం మాస్క్ ధరించడం కాదు.., మీ కోసం, మీ కుటుంబం కోసం మాస్క్ తప్పని సరిగా ధరించాలి. – డాక్టర్ వెంకటసుబ్బయ్య, క్లినికల్ సైకాలజిస్ట్, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

