Weather Update | సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉపరితల ద్రోణి ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కాగా, శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.4, కనిష్ఠం 23.0 డిగ్రీలు, గాలిలో తేమ 50 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.