కొవిడ్ బాధితుల కోసం040-2111 1111

- సలహాలు, సూచనల కోసం కంట్రోల్ రూం ద్వారా సేవలు
- రెండు పూటలా వైద్యులు అందుబాటులో..
- అవసరమైన వారికి మెడికల్ కిట్లు
కొవిడ్ బారినపడి ఇబ్బందులు పడుతున్నారా.. వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారా.. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదా.. అలాంటివారి కోసం జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్‌రూంలో ప్రత్యేకంగా వైద్యులను నియమించింది.. పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన మందులు, సలహాలు, సూచనలను ఈ వైద్యులు అందించనున్నారు. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.. తిరిగి రెండు నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఈ వైద్యులు సేవలు అందించనున్నారు.. కంట్రోల్ రూం నుంచి ఫోన్ ద్వారా కొవిడ్ నివారణ కోసం సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ఈ మేరకు కంట్రోల్ రూంలో విధులు నిర్వర్తించే వైద్యులకు సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, అడిషనల్ కమిషనర్ సంతోష్, వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్య లు చేపడుతున్నదని చెప్పారు. కొవిడ్ బాధితుల కోసం జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని.. బాధితులు 040-2111 1111 కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం 104కు వచ్చే కాల్స్‌ను కూడా కొవిడ్ కంట్రోల్ రూం నంబర్‌కు అనుసంధానం చేస్తున్నట్లు రిజ్వీ పేర్కొన్నారు.
వెంటనే మందులు వాడాలి..
- అనంతరం వైద్య శాఖ ఓఎస్డీ గంగాధర్ మాట్లాడుతూ.. కొవిడ్ లక్షణాలుంటే వెంటనే టెస్టులనీ, పరీక్షలనీ, స్కాన్లు అని వెళ్లొద్దని, ముందస్తుగా ఐదురోజుల పాటు మందులు వాడాలని సూచించారు.
- రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. అవసరమైన వారికి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల ద్వారా మెడికల్ కిట్లు అందచేస్తున్నట్లు తెలిపారు.
- అనంతరం జీహెచ్ఎంసీ కొవిడ్ కంట్రోల్ రూంను వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ సందర్శించారు.
- కంట్రోల్ రూం పనితీరును సిబ్బందిని ఆడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

