Roads Construction | అంబర్‌పేటలో విరివిగా రోడ్ల నిర్మాణం : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీలో విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గత 15 సంవత్సరాలలో జరగని అభివృద్ధి మూడేండ్లలో జరిగిందని చెప్పారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ పోచమ్మబస్తీలో రూ.9 లక్షలు, జంజం మసీదు వద్ద రూ.12 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్లలోని అన్ని బస్తీలు, కాలనీల్లో అధ్వాన్నంగా మారిన రోడ్ల స్థానంలో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తున్నామని చెప్పారు.
రోడ్ల నిర్మాణంతో పాటు మంచినీరు, డ్రైనేజీ పైప్‌లైన్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వీది దీపాల ఏర్పాటు, పార్కుల సుందరీకరణ వంటి అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. నియోజకవర్గం ప్రజల భాగస్వామ్యం, సహకారంతో అన్ని పనులు చేయడం జరుగుతుందని చెప్పారు. చాలా చోట్ల రోడ్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని, మరిన్ని చోట్ల ఇంకా ప్రారంభం కావాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు శ్రీరాములుముదిరాజ్, మిర్యాల రవీందర్, బంగారు శ్రీను, శివాజీయాదవ్, నవీన్‌యాదవ్, బీజేపీ నాయకులు చుక్క జగన్, రంగంపల్లి రాజు, అచ్చిని రమేష్, అచ్చిని మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

