ఇప్పటివరకు ఇచ్చిన ఇండ్లు 61,596
నగరంలో డబుల్ ఇండ్ల పండుగ..కన్నుల పండువగా కొనసాగుతున్నది. మూడోవిడుతలో భాగంగా గురువారం మలి దశలో 17,676 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 61,596 ఇండ్లను పేదలకు అప్పగించారు.
- నిరుపేదలకు సొంతింటి కల సాకారం
- కనుల పండువగా డబుల్ ఇండ్ల పండుగ
- పారదర్శకంగా.. పైసా ఖర్చులేకుండా..నిరంతరాయంగా పంపిణీ ప్రక్రియ
- పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, డిప్యూటీ స్పీకర్
- లబ్ధిదారుల ఆనందభాష్పాలు
నగరంలో డబుల్ ఇండ్ల పండుగ..కన్నుల పండువగా కొనసాగుతున్నది. మూడోవిడుతలో భాగంగా గురువారం మలి దశలో 17,676 మంది లబ్ధిదారులకు ఇండ్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 61,596 ఇండ్లను పేదలకు అప్పగించారు. మహానగరంలో సొంతింటి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్ సర్కారు మళ్లీ రావాలని లబ్ధిదారులు దీవించారు.
– సిటీబ్యూరో, అక్టోబరు 5 (నమస్తే తెలంగాణ)
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 5 : దేశంలో ఎక్కడి లేని విధంగా తెలంగాణలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. గురువారం నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి 2845 డబుల్ బెడ్రూం ఇండ్లను ఉప్పల్, అంబర్‌పేట, యాకత్పురా నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ రూ. 50 లక్షల విలువ చేసే డబుల్ బెడ్రూం ఇండ్లను పొందిన పేదలు అదృష్టవంతులని, ఇండ్లను ఎట్టి పరిస్థితుల్లో అమ్మవద్దని పద్మారావు కోరారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, కమిషనర్ రాజేందర్‌కుమార్, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కిరాయి బాధలు తప్పాయి..
- ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ ఇండ్లను అందిస్తున్నారు. పేదలకు ప్రతి నెల కిరాయి తప్పింది. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 200 శాతం అమలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను అధిక ఓట్లతో గెలిపించి మరోసారి సీఎంను చేయాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

