లాభాల బాట ఉత్తి మాటేనా?.. గ్రేటర్ ఆర్టీసీ మరోసారి చార్జీల మోత
గ్రేటర్ ఆర్టీసీ..మరోసారి చార్జీల మోత మోగించింది. టికెట్ ధరలను పెంచి.. ప్రయాణికుల నడ్డి విరిచింది. కనీస చార్జీ ఏకంగా 50 శాతం పెరగనున్నది. సిటీ ఆర్డినరీ..మెట్రో ఎక్స్‌ప్రెస్.. ఈ -బస్సుల్లో కొత్త ధరలు అమలు కానున్నాయి.
- ఆర్టీసీ బాదుడు
- సిటీ ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపు
- కనీస చార్జీపై 50 శాతం..
- రూ.10 టికెట్ రూ.15
- మొదటి మూడు స్టేజీల
- వరకు రూ.5 పెంపు 4వ స్టేజీ నుంచి రూ. 10..
- మెట్రో డీలక్స్‌లో మొదటి స్టేజీకి రూ.5..
- రెండో స్టేజీ నుంచి రూ.10 పెంపు రేపట్నుంచి కొత్త రేట్లు అమల్లోకి..
గ్రేటర్ ఆర్టీసీ.. మరోసారి చార్జీల మోత మోగించింది. టికెట్ ధరలను పెంచి.. ప్రయాణికుల నడ్డి విరిచింది. కనీస చార్జీ ఏకంగా 50 శాతం పెరగనున్నది. సిటీ ఆర్డినరీ..మెట్రో ఎక్స్‌ప్రెస్.. ఈ -బస్సుల్లో కొత్త ధరలు అమలు కానున్నాయి. ఉచిత బస్సుతో సంస్థ లాభాల బాట పట్టిందని.. చెబుతున్న సర్కారు మాటలు ఉత్తిదేనని తాజా పెంపుతో తేలిపోయిందని ప్రయాణికులు మండిపడుతున్నారు. సవరించిన ధరలు సోమవారం నుంచి అమలు కానున్నాయి.
సిటీబ్యూరో, అక్టోబర్ 4 ( నమస్తే తెలంగాణ ) : మరోసారి ప్రయాణికులపై ఆర్టీసీ (Greater RTC) పిడుగు పడనున్నది. ఇప్పటికే విద్యార్థుల బస్ పాస్‌లు, టీ-24 టికెట్ చార్జీలు పెంచిన ఆర్టీసీ.. మరోసారి ప్రయాణికులపై భారం (Ticket fare Hike) మోపడానికి సిద్ధమైంది. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీని లాభాల బాటలో చేశామని మాటలు నీళ్ల మూటలేనని తేలిపోయింది. ఏకంగా కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెరిగాయి. ఇప్పటి వరకు నగరంలో సిటీ బస్సు మొదటి స్టేజ్ ఫెయిర్ రూ.10 ఉంటే ఇప్పుడు రూ.5 పెంచుతూ రూ.15 చేశారు. ఇలా మొదటి మూడు స్టేజీలకు రూ.5 అదనంగా వసూలు చేయనున్నారు.
అనంతరం నాలుగో స్టేజీ నుంచి ఉన్న కనీస చార్జీపై అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. అంటే నాలుగో స్టేజీకి ఇప్పటి వరుక రూ.20 ఉంటే రూ.10 అదనంతో రూ.30గా నిర్ణయించారు. ఇలా గ్రేటర్ జోన్ పరిధిలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ , ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పెరిగిన ధరలు అమలుకానున్నాయి. సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ టికెట్ ధరల పెంపు నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విద్యార్థులపై సైతం..!
విద్యార్థుల బస్‌పాస్‌ల ధరలను సైతం ఇటీవల ఆర్టీసీ పెంచడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. నెలవారి స్టూడెంట్ పాస్ రూ.400 ఉంటే ప్రస్తుతం 200 పెంచుతూ రూ. 600 చేశారు. తైమాసిక పాస్ 1200 ఉంటే ఇప్పుడు 1800 అయింది. గ్రేటర్లో 1.50లక్షల స్టూడెంట్ బస్ పాస్‌లున్నాయి. నెలవారీ రూ.400 ధరతో రూ.6 కోట్లు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది. ఇప్పుడు పెరిగిన రూ.600తో 9 కోట్ల ఆదాయం వస్తుంది.
అదనంగా రూ.3 కోట్లు విద్యార్థులపై సర్కార్ భారం మోపిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, పుష్పక్ బస్సుల టికెట్ ధరలను సైతం పెంచి ప్రయాణికుల నడ్డి విరిచింది. విమానాశ్రయం వెళ్లే పుష్పక్ బస్సుల టికెట్ ధరలను గతంలో రూ.300 ఉంటే రూ.50 పెంచి రూ.350 చేసిన విషయం తెలిసిందే. టీ-24 చార్జీలను సైతం పెంచింది.
భారం..భారం..!
గ్రేటర్లో 2800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. 30వేల ట్రిప్పులు కొనసాగుతున్నాయి. మహాలక్ష్మి ఉచిత బస్సు స్కీం రాకముందు గ్రేటర్లో ఒక్క రోజుకు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవారని అధికారులు చెబుతున్నారు. ఉచిత ప్రయాణం వచ్చాక ఒక్క రోజుకు 26లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు సుమారు 16 లక్షల మంది ఉన్నారు. కాగా, టికెట్ తీసుకుంటూ సుమారు 8 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఈ లెక్కన వీరిపై అదనంగా కోటి రూపాయలకు పైగా రోజుకు భారం పడనుందని నిపుణులు చెబుతున్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

