సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): “సిటీ కళాశాల… తెలంగాణకే గర్వకారణం. ఇంతటి అద్భుత కట్టడం వందేండ్లుగా చేస్తున్న కృషి అపూర్వం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇదొక జ్ఞాన దీపస్తంభం…” ఈ మాటలన్నది ఎవరో కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న ఆచార్యులు. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం క్షేత్ర పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి 50 మంది అధ్యాపకులు సిటీ కాలేజీని సందర్శించారు.
కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టిన బీబీఏ రిటైలింగ్ కోర్సు వివరాలు తెలుసుకుని, కామర్స్ విభాగం సందర్శనకు ఏపీ ఆచార్యులు వచ్చారు. ఇకడి అధ్యాపకులతో, విద్యార్థులతో సంభాషించారు. కాలేజీలో ప్రవేశపెట్టిన వినూత్నమైన కోర్సులను, నిర్వహిస్తున్న అనేక పాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని, వివిధ విభాగాల ప్రయోగశాలలను సందర్శించారు. కళాశాల భవనా నిర్మాణానికి ముగ్ధులయ్యారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
విద్యార్థుల నైపుణ్యం సూపర్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థ సిటీ కళాశాలను శిక్షణ కార్యక్రమంలో భాగంగా సందర్శించాను. అకడి విద్యార్థులతో సంభాషించినప్పుడు, వారికి గల కమ్యూనికేషన్తోపాటు లైఫ్ సిల్స్ చూసి సంతోషంగా అనిపించింది.
– డాక్టర్ ఎస్.ప్రసాదరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిడదవోలు
అరుదైన గ్రంథాలయం..
నూరేండ్ల చరిత్ర కలిగిన సిటీ కాలేజీని దర్శించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇకడ గ్రంథాలయం నన్ను బాగా ఆకట్టుకున్నది. వంద సంవత్సరాల కింద రాసిన పుస్తకాలు కూడా ఇకడ ఉన్నాయి. 18వ శతాబ్దానికి చెందిన అరుదైన డిక్షనరీ ఉంది. 80వేలకు పైగా పుస్తకాలు ఒకేచోట చూడటం ఒక అద్భుతం. ఇంత మంచి లైబ్రరీని, కళాశాలను నిర్వహిస్తున్న సిబ్బందికి అభినందనలు.
– డాక్టర్ ప్రవీణ్ దత్తు, సహాయాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తిరువూరు
కళాశాల అదృష్టం
సిటీ కళాశాల నగరంలో ఒక ప్రాచీన నిర్మా ణం. కానీ విద్యార్థుల ఆధునిక విద్యావసరాలను తీరుస్తూ సగర్వంగా నిలబడిన ఒక దీప స్తంభం. విద్యార్థులను అన్ని కోణాల్లో తీర్చిదిద్దే నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన అధ్యాపకవర్గం, పాలనాదక్షులైన ప్రిన్సిపాల్ ఉండటం కళాశాల అదృష్టం. కళాశాల వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన డిజిటల్ పైలాన్ (వీడియో చిత్రం) చూసి భావోద్వేగానికి గురయ్యాను.
– డాక్టర్ కాకుమాను శ్రీనివాసరావు,ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమవరం
సిటీ కాలేజీ ఆదర్శనీయం
100 సంవత్సరాలుగా ఐఏఎస్, ఐపీఎస్, సినీ రంగంలోనూ వివిధ అన్ని వృత్తులకు సంబంధించిన నిష్ణాతులైన వారిని తయారు చేయడంలో కళాశాల విజయం సాధించింది. ఇటువంటి ప్రసిద్ధి గాంచిన కళాశాల దర్శించడం చాలా సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలకు ఇది ఒక ఆదర్శనీయంగా నేను భావిస్తున్నాను. సైన్స్ విభాగాల్లో విద్యార్థులు ప్రయోగాలు చేయటానికి చకని ప్రయోగశాలలు నిర్మించడం, విద్యార్థులను ప్రయోగాత్మకంగా తీర్చిదిద్దడం ఎంతో సంతోషంగా ఉంది.
– డాక్టర్ ఎస్.చంద్రకళ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాడేరు విశాఖపట్నం జిల్లా
స్ఫూర్తిదాయకం
కళాశాలలోని గ్రంథాలయంలోకి అడుగుపెట్టగానే ఏదో తెలియని తన్మయత్వం కలిగింది. అకడి విద్యార్థులలో ఉన్నతస్థాయి క్రీడాకారులు, చిత్రకారులు ఉండటం స్ఫూర్తివంతంగా అనిపించింది.
– డాక్టర్ ఎ.హైమావతి, సహాయాచార్యులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, విశాఖ పట్టణం
కాలానుగుణంగా కొత్త కోర్సులు..
వందేళ్ల క్రితం ఎంతో దార్శనిక దృష్టితో అనేక సౌకర్యాలతో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి నెలకొల్పబడిన సిటీ కళాశాలను సందర్శించటం మంచి అనుభూతిని కలిగించింది. తెలంగాణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి దోహదం చేసే మంచి విద్యాలయంగా సిటీ కాలేజీని భావిస్తున్నాం. మారిన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వినూత్నమైన రిటైల్ మారెటింగ్ లాంటి కోర్సులను ప్రవేశపెట్టటం ముదావహం
– డాక్టర్ కొండా రవి, తెలుగు శాఖ అధ్యక్షులు, అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నారాయణపురం