బంజారాహిల్స్, నవంబర్ 27: యువతిని వెంటపడి వేధిస్తున్న వర్ధమాన సంగీత దర్శకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యూసుఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసముంటున్న యువతి(27) అమీర్‌పేటలోని ఓ సంస్థలో అకడమిక్ అడ్వయిజర్‌గా పనిచేస్తున్నది. ఈనెల 7న స్థానికంగా ఉన్న శివాలయానికి వెళ్లిన యువతిని చూసిన అదే ప్రాంతానికి చెందిన సంగీత దర్శకుడు రాజు (24) వెంబడించాడు.
యువతి ఇంటి అడ్రస్ తెలుసుకోవడమే కాకుండా మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి ముందు నిలబడి కిటికిలోంచి చూశాడు. బాధితురాలు గట్టిగా నిలదీయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల యువతి ఫోన్ నంబర్ తెలుసుకున్న రాజు.. ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తూ, కాల్స్ కూడా చేశాడు. ఇన్స్టాగ్రామ్ నుంచి ఫొటోను సేకరించి.. తన ఫోన్‌కు డీపీగా పెట్టుకున్నాడు. అతడి వేధింపులు తీవ్రం కావడంతో ఆదివారం బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 354(డి) సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.