మూడేండ్ల బాలుడి పైనుంచి దూసుకెళ్లిన కారు
మూడేండ్ల బాలుడి పైనుంచి ఓ కారు రెండు చక్రాలు దూసుకువెళ్లడంతో దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెలితే... బౌరంపేటలోని ల్యాండ్‌మార్క్ -2 గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో
- బౌరంపేటలో ఘటన
దుండిగల్, సెప్టెంబర్ 1 : మూడేండ్ల బాలుడి పైనుంచి ఓ కారు రెండు చక్రాలు దూసుకువెళ్లడంతో దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెలితే… బౌరంపేటలోని ల్యాండ్‌మార్క్ -2 గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో మంగళవారం ఉదయం ఓ వ్యక్తి తనకారును నీటితో శుభ్రం చేసుకున్న అనంతరం కారులోకి ఎక్కి స్టార్ట్ చేశాడు. ఇంతలో ఓ మూడేండ్ల బాలుడు కారుపక్కనుంచి నడుచుకుంటూ వచ్చి కారుముందు నిల్చున్నాడు.
బాలుడు ఎత్తు తక్కువగా ఉండటంతో కారు నడిపే వ్యక్తికి కన్పించకపోవడంతో కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో కారు ముందు నిలుచున్న బాలుడు ముందుగా కారు ఎడమవైపు ముందు చక్రాల కింద పడిపోయాడు. వెనుక చక్రాలు సైతం బాలుడిపై నుంచి వెళ్లాయి. కొద్ది క్షణాల్లో బాలుడి తల్లి బయటకు వచ్చి నేలపై పడిపోయిన బాలుడిని అక్కున చేర్చుకొని అక్కడి నుంచి ఇంట్లోకి తీసుకువెళ్లింది. ఇదంతా రెండే నిమిషాల్లో జరిగింది. కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని బాచుపల్లిలోని ఓ వైద్యశాలకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

