రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ
టైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో దొంగలు పడి 100 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ జాగీరు పరిధిలోని గంధంగూడ కృష్ణారెడ్డినగర్ కాలనీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రవిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు.
- 100 తులాల బంగారం పోయిందని.. బాధితుల ఫిర్యాదుమణి
కొండ, జూలై 9: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో దొంగలు పడి 100 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బండ్లగూడ జాగీరు పరిధిలోని గంధంగూడ కృష్ణారెడ్డినగర్ కాలనీలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రవిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి విజయవాడకు వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. ఇంట్లో దాచిన బంగారం, నగదు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. తాళం విరిగిపోయి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించారు. బాధితులిచ్చిన ఫిర్యాదులో 100 తులాల బంగారం, నగదు, ఇతర వస్తువులు పోయినట్లు పేర్కొన్నారు. అయితే, 15 తులాల బంగారం మాత్రమే దొంగతనానికి గురైనట్టు నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు పేర్కొన్నారు. అదే విధంగా స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

