ఎమ్మెల్సీ పోరులో బీఆర్ఎస్ దూకుడు
త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నేతలు దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీని సైతం అధిగమించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు.
- గత మెజార్టీ దాటడమే ఏకైక లక్ష్యం
- కాంగ్రెస్ పాలనా లోపాలే.. అస్ర్తాలుగా కదనరంగంలోకి..
- నియోజకవర్గాల వారీగా ముగిసిన సన్నాహక సమావేశాలు
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ) : త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నేతలు దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో సాధించిన మెజార్టీని సైతం అధిగమించడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మక మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి అద్భుత విజయం సాధించి శాసనమండలిలో గులాబీ జెండాను ఎగురవేసిన విషయం తెలిసిందే. ఈసారి ఆ నాటి గెలుపు విజయాన్ని పునరావృతం చేయడమే కాకుండా, సురభి వాణీదేవి సాధించిన మెజార్టీ కంటే మరింత భారీ మెజార్టీతో విజయం సాధించడమే బీఆర్ఎస్ ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది.
కాంగ్రెస్ సరార్ వైఫల్యాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో నిరసనలపై యువతలో ఉన్న తీవ్ర వ్యతిరేకతను, అసంతృప్తిని ప్రజల్లోకి తీసుకెళ్తూ, గులాబీ దళం క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది. పట్టభద్రుల మద్దతు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్కే ఉందనే ధీమాతో గులాబీ శ్రేణులు ఎన్నికల కదనరంగంలోకి దిగారు. ఫస్ట్ కం ఫస్ట్ ప్రాదిపదికన ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో కేడర్‌ను దిశానిర్ధేశం చేస్తున్నారు. తాజాగా ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసోజు శ్రవణ్‌లు పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేశారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో ఏర్పడిన సంక్షోభాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో మోసాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలే ప్రధాన అస్ర్తాలుగా బీఆర్ఎస్ పట్టభద్రులను ఆకట్టుకుంటున్నది.
ఫస్ట్ కం.. ఫస్ట్ ప్రాతిపదికన ఓటరు నమోదు
కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు నేరుగా రంగంలోకి దిగారు. ప్రతి నియోజకవర్గాన్ని జల్లెడ పడుతూ సన్నాహాక సమావేశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అత్యధిక నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు విజయవంతంగా పూర్తయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గ స్థాయిలో కేడర్‌కు దిశానిర్దేశం చేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియే కీలకమని భావించి ఈ దిశగా ఓటర్ల నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘ఫస్ట్ కం – ఫస్ట్ ప్రాతిపదికన’ గ్రాడ్యుయేట్లతో సమన్వయం చేసుకుంటూ, అర్హులైన ప్రతి ఒకరిచేత దరఖాస్తులు నింపించే బాధ్యతను స్థానిక నాయకులకు అప్పగించారు.
డిగ్రీ పూర్తి చేసిన యువతను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించడంలో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయాన్ని ఓటర్లకు వివరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పాలనా లోపాలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైన తీరును ఎండగడుతూనే, ఓటరు నమోదు వేగవంతం చేయనున్నారు. మొత్తానికి, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గులాబీ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి పట్టభద్రుడిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించే బాధ్యతను పార్టీ కార్యకర్తలు తమ భుజసంధాలపై వేసుకోవడం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

