GHMC | జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం.. కమిషనర్‌కు వినతిపత్రం
GHMC | జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
GHMC | జీహెచ్ఎంసీ వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వార్డుల విభజనను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాపాలన అంటూ సొల్లుమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఇష్టానుసారంగా వార్డులను పెంచారని అన్నారు.
జీహెచ్ఎంసీలో కాంగ్రెస్‌కు పట్టులేకపోవడంతో బీఆర్ఎస్ను దెబ్బకొట్టాలనే ప్రయత్నం చేస్తుందని దాసోజు శ్రవన్ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా వెళ్లకపోతే జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కోర్టుకెళ్తామని హెచ్చరించారు. రూల్స్‌కు అనుకూలంగా విభజన ఉండాలని.. తమ అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు.
ప్రజలతో మాట్లాడకుండా ఇష్టానుసారంగా వార్డులను ఏర్పాటు చేశారని సనత్‌నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆఫీసులో కూర్చొని 300 డివిజన్లు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ఎందుకంత తొందరపాటు అని ప్రశ్నించారు. ఈ వార్డుల విభజనపై రేపు కౌన్సిల్ సమావేశంలో మాట్లాడతామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న 150 డివిజన్లకే అధికారులు లేరని గుర్తుచేశారు. ఫ్లెక్సీల విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మేడ్చల్ మొత్తం రూరల్‌గా ఉండేదని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. అనేక మంది ఉన్న పాలనను 16 మందికి కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉంటే కేవలం 16 కార్పొరేటర్లను చేశారని తెలిపారు. బంజారాహిల్స్లాగా కీసర ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్‌లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

