Constable | చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలి : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
Constable | చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Constable | బేగంపేట్, మార్చి 13: చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరించాలని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన కార్యాలయంలో జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై వరుణ్ సందేశ్, మధులిక జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో నిర్మించిన కానిస్టేబుల్ చిత్రంలోని మేఘం కురిసింది అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైనదని పేర్కొన్నారు. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్‌తో నిర్మించిన చిత్రం విజయవంతం కావాలని, ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించే ఫ్యాన్ ఇండియా చిత్రాలలో కొన్ని మాత్రమే విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తాము కూడా రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్‌గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, చిత్ర హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీష్, బీఆర్ఎస్ నాయకులు జగ్గయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

