MLA Talasani | మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం : ఎమ్మెల్యే తలసాని
MLA Talasani | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.
MLA Talasani | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. సోమవారం మాదాపూర్‌లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ నివాసానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి వెళ్ళి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోపీనాథ్ సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 1992 నుండి మాగంటి గోపీనాథ్, తాను ఒక సోదరుడిగా, మంచి మిత్రులుగా కలిసి రాజకీయాలలో ఉన్నామని గుర్తు చేసుకున్నారు. గత నెల 26వ తేదీన తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళామని, వెళ్ళే ముందు కూడా తాము కలుసుకున్నామని వివరించారు. ఇంతలోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు. గోపీనాథ్ మృతివార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భౌతికంగా గోపీనాథ్ దూరమైనప్పటికీ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు కూడా ధైర్యంగా ఉండాలని కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట మలక్‌పేట నియోజకవర్గ ఇంచార్జి ఆజాం, అమీర్‌పేట డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, అశోక్ యాదవ్, శ్రీహరి, ఆరీఫ్, హరిసింగ్, నారాయణ రాజు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

