Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Nirudyoga Batukamma : రాష్ట్ర పండుగైన 'బతుకమ్మ' వేడుకల్లోనూ అదే వైఖరి కనిపిస్తోంది. నోటిఫికేషన్లు ఏవి? అని ప్రశ్నిస్తున్నారంతా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో గురువారం 'నిరుద్యోగ బతుకమ్మ' నిర్వహించారు.
Nirudyoga Batukamma : అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రజా పాలనను ఎండగడుతూ కేసీఆర్ జనరంజక పాలనను కీర్తిస్తూ మొన్న వినాయకచవితో డీజేలు మోత మోగాయి. ఇప్పుడు రాష్ట్ర పండుగైన ‘బతుకమ్మ వేడుక’ల్లో (Batukamma Celebrations)నూ అదే వైఖరి కనిపిస్తోంది. నోటిఫికేషన్లు ఏవి? అని ప్రశ్నిస్తున్నారంతా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్లో గురువారం ‘నిరుద్యోగ బతుకమ్మ’ (Nirudyoga Batukamma) నిర్వహించారు. ఈ సందర్భంగా తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.
మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలను బతుకమ్మ వేడుకల్లో నిరసిస్తున్నారు జనం. ఎక్కడ చూసినా కేసీఆర్ హయాంను కొనియాడుతున్న పాటలు వినపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నేతృత్వంలో గురువారం దిల్సుఖ్ నగర్లో ‘నిరుద్యోగ బతుకమ్మ’ వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మాయిలు, యువత.. నోటిఫికేషన్లు రావాలే.. నిరుగ్యోగుల బతుకులు మారాలే అని పాటలు పాడారు. అనంతరం ‘తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో, నిరుద్యోగుల బతుకులు మారాలే ఉయ్యాలో’ అని రాసున్న ప్లకార్డులు ప్రదర్శించారు. పలు కోచింగ్ సెంటర్లు ఉండే ప్రాంతం కావడంతో నిరుద్యోగ బతుకమ్మలో అమ్మాయిలు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

