విశ్రాంత ఐపీఎస్ సతీమణి హత్య కేసులో పురోగతి!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన
బంజారాహిల్స్.అక్టోబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు కల్పన అలియాస్ ధర్మతో పాటు మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉండే విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ రే సతీమణి తనూజా రంజన్(61)ను మే 8న దారుణంగా హత్యచేసిన నేపాలీ గ్యాంగ్ సభ్యులు చోరీకి పాల్పడి పారిపోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో తనుజా రంజన్ ఇంట్లో పనిమనిషిగా చేరిన నేపాలీ గ్యాంగ్ సభ్యురాలు కల్పన అలియాస్ ధర్మ(30)తో పాటు సురేశ్షాహీ అలియాస్ సృజన్ షాహీ, గణేశ్ బికాస్, కంచా లామాతో మరో నలుగురు వ్యక్తులను నిందితులుగా గుర్తించిన పోలీసులు వేట ప్రారంభించగా నిందితులందరూ చోరీ సొత్తును పంచుకుని వేర్వేరు మార్గాల్లో నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రత్యేక పోలీసు బృందాలు నేపాల్‌కు వెళ్లినా నిందితులను పట్టుకోలేకపోయారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఓ నిందితుడు సునీల్ పర్యార్(29)ను రెండునెలల క్రితం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఏడుగురు నిందితులను పట్టుకునేందుకు మూడునెలలుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక బృందం కల్పనతో పాటు ఇతర నిందితుల కదలికలపై నిఘా పెట్టారు.
కాగా తనూజా రంజన్ హత్య తర్వాత నేపాల్‌లో తలదాచుకున్న కల్పనతో పాటు మరో ముగ్గురు నిందితులు మరో చోరీకి స్కెచ్‌వేసి వేర్వేరు మార్గాల్లో నేపాల్ నుంచి యూపీ, బిహార్, ఢిల్లీ ప్రాంతాలకు చేరుకున్నట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వేర్వేరు బృందాలు రంగంలోకి దిగి వివిధ ప్రాంతాల్లో తలదాచుకున్న కల్పనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నలుగురు నిందితులను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు విచారిస్తున్నారు. చోరీలో పాల్గొన్న మిగిలిన వారి ఆచూకీతో పాటు చోరీ సొత్తు ఎక్కడ విక్రయించారు..తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. ఒకటిరెండు రోజుల్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

