Police station | బోరబండకు త్వరలో పోలీస్‌స్టేషన్
ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో ఉన్న బోరబండ ఔట్‌పోస్ట్ త్వరలో పోలీస్ స్టేషన్‌గా మారనుంది.
ఎర్రగడ్డ : ఎస్సార్‌నగర్ ఠాణా పరిధిలో ఉన్న బోరబండ ఔట్‌పోస్ట్ త్వరలో పోలీస్ స్టేషన్‌గా మారనుంది. రెండు నెలల్లో బోరబండకు పోలీస్ స్టేషన్‌ను కేటాయించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బోరబండలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో స్వయం గా పేర్కొన్నారు. సుమారు 40 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఔట్‌పోస్ట్ ను ఏర్పాటు చేసినప్పుడు దీని పరిధిలో జనాభా 20 వేలే ఉండేది.
క్రమంగా మౌలిక వసతులు సమకూరటంతో మినీ ఇండియాగా మారిన బోరబండ ప్రాంత జనాభా నేడు దాదాపు 2 లక్షలకు చేరింది. ఐతే 6 ఏండ్ల క్రితం వరకు ఔట్‌పోస్ట్ అద్దె భవనంలోని ఇరుకు గదిలో కొనసాగింది. బాబా ఫసియుద్దీన్ ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై డిప్యూటీమేయర్ పదవిని చేపట్టగానే ఇరుకు గదిలో కొనసాగుతున్న ఔట్‌పోస్ట్ ను సైట్-2 కాలనీలోని విశాలమైన కమ్యూనిటీహాల్ ప్రాంగణానికి తరలింపజేయటం జరిగింది.
బోరబండలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత గురించి గత 5 ఏండ్లుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా పూర్తి స్థాయి ఠాణాకు తగ్గకుండా ఔట్‌పోస్ట్ ను తీర్చిదిద్దారు. కొత్త సొబగులు దిద్దుకున్న దీన్ని శనివారం హోంమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, సీవీ ఆనంద్‌లు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బోరబండలో త్వరలో ఠాణాను ఏర్పాటు చేయనున్నట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. కాగా బోరబండ ఔట్‌పోస్ట్ పరిధిలో బోరబండ డివిజన్ పూర్తి ప్రాంతం, రాజీవ్‌నగర్, బీఎస్పీ కాలనీ, కల్యాణ్‌నగర్ వెంచర్-3, హెచ్‌ఎఫ్‌నగర్, శ్రీరాంనగర్, ఎస్పీఆర్ హిల్స్‌లోని కొంత ఏరియా ఉన్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

